సుప్రీంలో అమరావతి కేసులో కీలక అప్ డేట్..!?

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీం తీర్పు కీలకం కానుంది. దీనికి సంబంధించి కీలక అప్ డేట్ వెల్లడైంది.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీం తీర్పు కీలకం కానుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు కసరత్త చేస్తున్నారు. అయితే, కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో.. వేచి చూసే ధోరణితో ఉంది. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచన. సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న అధికార పార్టీ..దీనికి అనుగుణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించి..ముందుడుగు వేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు నుంచి దీనికి సంబంధించిన సమాచారం అందింది.

మూడు రాజధానులకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. 23వ తేదీన ఈ కేసు విచారణ జరపుతామని ఈ నెల 6వ తేదీన జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ ఏవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఈ రోజు (గురువారం) విచారణ జరగాల్సి ఉంది. కానీ, నోటీసులు జారీ చేసిన కేసులను ఈ గురు, శుక్రవారాల్లో ధర్మాసనాలు విచారించవని తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. దీంతో..ఈ రోజు మూడు రాజధానుల వ్యవహారం విచారణకు వచ్చే అవకాశం లేదని సమాచారం. ఇక, రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఈ కేసును ప్రస్తావించిన సమయంలో..లేదంటే రిజిస్ట్రీ ఈ కేసును విచారణ జాబితాలో చేర్చినప్పుడే విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Supreme court: Top court key update over hearing of AP capital, will decide when the case will come infront of the bench

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ కేసును త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం లేఖతో ఈ రోజు విచారణకు సమయంగా నిర్ణయించారు. కానీ, తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఈ కేసు విచారణ ఈ రోజు లేదని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని గతంలో స్పష్టత ఇస్తూ తీర్పు ఇచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లింది. తొలి విచారణలో భాగంగా ఆరు నెలల సమయంలో అమరావతి నిర్మాణం పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అసెంబ్లీకి రాజధాని ఖరారు చేసే అధికారం లేదన్న హైకోర్టు ఆదేశాలను రద్ద చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్దించింది. దీంతో...రాజధాని కేసుకు సంబంధించి సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+