చంద్రబాబు: ఇంకా 11 రోజులే?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు డిసెంబరు 12లోగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు రాగా సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసును రిజర్వ్ లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు వెలువరించిన తరువాత టేకప్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు బెయిలు పిటిషన్ విచారణ గురువారం ఈ బెంచ్ ముందుకు వచ్చింది. దీంతో ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం డిసెంబరు 12వ తేదీలోగా ఎటువంటి చర్యలు చేపట్టొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. క్వాష్ పిటిషన్ పై 12లోపు తీర్పు వెలువరించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం అంగీకరిస్తే చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులన్నీ వీగిపోతాయి. ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నప్పటికీ జైలులో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైనే పట్టుబట్టారు. బెయిల్ కోసం అసలు ప్రయత్నించలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన తీర్పు 12వ తేదీలోగా వెలువడుతుందని, అది అనుకూలంగా వస్తుందనే ఆశాభావంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న బాబు ఒక ముఖ్యమైన పనికి శ్రీకారం చుట్టేందుకు ముందుగానే శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆ ముఖ్యమైన పని ఏమైవుంటుందా? అనే యోచనలో టీడీపీ శ్రేణులతోపాటు వైసీపీ శ్రేణులు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications