ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి : ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీం వార్నింగ్
కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం మరియు ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినప్పటికీ, వచ్చే నెలలో పదవ తరగతి, 12 వ తరగతి పరీక్షలు జరపాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. పరీక్షల కారణంగా ఒక విద్యార్ధి చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా పరీక్షలను నిర్వహించాలని అనుకుంటుంది?
ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు , ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా పరీక్షలను నిర్వహించాలని అనుకుంటుంది? అని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం గురువారం ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల రద్దు పై దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాల పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది.

పక్కా సమాచారం ఇవ్వాలని ముందే సూచించినా అఫిడవిట్లో ఆ సమాచారం ఏమీ లేదు
పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ముందే సూచించినా అఫిడవిట్లో ఆ సమాచారం ఏమీ లేదని పేర్కొంది. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం కేవలం పరీక్షల నిర్వహణ అనే ఆలోచననే కాకుండా, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని పేర్కొంది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు ఎక్కడా అఫిడవిట్లో పేర్కొనలేదని ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 34 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది.

పరీక్షలకు అన్ని గదులు మీకెక్కడ లభిస్తాయి?
ఈ వారం ప్రారంభంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సామాజిక దూరపు ప్రోటోకాల్‌లు పాటించేలా 15 నుంచి 18 మంది విద్యార్థులను ఒక గదిలో కూర్చోబెట్టనునట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 34,634 గదులు అవసరమవుతాయని, అన్ని గదులు మీకు ఎక్కడ లభిస్తాయి అని ప్రశ్నించింది. అయితే ఏపీ ప్రభుత్వం 34,000 గదులను గుర్తించామని సుమారు 50 వేల మంది బోధన బోధనేతర సిబ్బంది టీకాలు వేశామని పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సమాధానం చెప్పింది.

ఒక్కరు చనిపోయినా కోటి పరిహారం ఇవ్వాలి
ఒకపక్క కరోనా కొనసాగుతున్న సమయంలో ఒక్కో గదిలో 15 నుండి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. మరణించిన వారి కుటుంబాలకు పరిహారంగా కోటి రూపాయలు ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఒకవేళ ఒక విద్యార్థి మరణించిన, పరీక్షల కారణంగా ఎవరికి ప్రాణహాని జరిగినా ఆంధ్రప్రదేశ్ కూడా కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సి దేనని కోర్టు తెలిపింది. కేవలం పరీక్షలు నిర్వహిస్తే సరిపోదని, ఆ తర్వాత వాటిని మూల్యాంకనం చేయడంతో పాటు చాలా పని ఉంటుంది అని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఇక వాటికి సంబంధించిన వివరాలేవీ అఫిడవిట్లో కనిపించలేదని వ్యాఖ్యానించింది.

కరోనా సమయంలో ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు?
ఒకపక్క నిపుణులు కరోనా రకరకాల వేరియంట్లు ఉన్నాయని చెబుతున్నా, రెండవ దశలో తీవ్రత కొనసాగిన తర్వాత కూడా, ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ ఎలా ప్రభావితం చేస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితులలో, ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటూ నిలదీసింది. అవసరమనుకుంటే సీబీఎస్ఈ , యూజీసీ మరియు ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని పేర్కొన్న సుప్రీంకోర్టు గ్రేడ్లను మార్కులు గా మార్చడం కష్టమే అయినప్పటికీ పరిస్థితులను బట్టి తప్పదని వెల్లడించింది.

ఇప్పుడే చెప్పండి మీ నిర్ణయం ఏంటి?
ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ఏపీ తరపు వాదించిన న్యాయవాది కోర్టుకు తెలపగా, పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థులపై ఎంతో ప్రభావం చూపిస్తోందని కాబట్టి ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రతిఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్న అని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం పరీక్షలు నిర్వహించడం గురించి మాత్రమే కాదు. మీ ప్రణాళిక గురించి మాకు నమ్మకం లేదు అని వెల్లడించింది.

రేపే తదుపరి విచారణ చేస్తామన్న సుప్రీం ధర్మాసనం
పరీక్షలు జరుగుతున్న సమయంలో మూడవ వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం దీనిపై రేపే తదుపరి విచారణ జరపనున్నట్లుగా స్పష్టం చేసింది. మరి సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించి పరీక్షల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సమయంలో, కచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పిన సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications