చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా, నేడే కీలకం - సుప్రీంలో మరో పిటీషన్..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగనుంది. 17ఏ ఆధారంగా ఇక్కడ ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయి. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంలో మరో పిటీషన్ దాఖలు చేసారు. ఇటు ఫైబర్ గ్రిడ్ కేసులో ఈ నెల 16న ప్రత్యక్షంగా హాజరు పరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో, చంద్రబాబు కేసుల్లో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
క్వాష్ పిటీషన్ విచారణ:స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు 35 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‍పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది.చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన విచారణలో బాబు తరపున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ తర్వాత సిద్ధార్థ లుథ్రా, అభిషేక సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేయాలని, విచారణ నిలిపివేయాలని బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం విచారణ ప్రక్రియ చెల్లదని సాల్వే వాదించారు.

17ఏ పైనే ప్రధానంగా వాదనలు:ఇప్పటి వరకు మూడు విడతలుగా సుప్రీంలో ఇదే అంశం చుట్టూ వాదనలు జరిగాయి. 2021 డిసెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో విచారణ ప్రారంభమైందని సాల్వే వివరించారు. అదే సమయంలో సెక్షన్ 17ఏలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారని, అధికార దుర్వినియోగం విషయంలో చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉందని, కక్ష సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని సాల్వే ధర్మసనానికి వివరించారు.
సెక్షన్ 17ఏను 2018జులైకు ముందు జరిగిన నేరాలకు వర్తింపచేయడంలో అర్థం లేదని సాల్వే వాదించారు.నేరం జరిగిన తేదీలతో సంబంధం లేదని, సెక్షన్ 17ఏ ప్రకారం చట్టపరమైన రక్షణలు పిటిషనర్‌కు వర్తిస్తాయని సాల్వే పేర్కొన్నారు. మరోవైపు ఏపీ సిఐడి తరపున హాజరైన ముఖుల్ రోహత్గీ చంద్రబాబు వ్యవహారంలో 17ఏ ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు.
ఫైబర్ గ్రిడ్ లో బెయిల్ కోసం:రెండు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. వాదనల తరువాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇటు ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ ను కొట్టివేయటంతో... సుప్రీంకోర్టు లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అటు ఏసీబీ కోర్టు లో ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటీ వారెంట్ కు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ నెల 16న చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపరచాలని ఆదేశించింది. అటు 17న స్కిల్ స్కాంలో హైకోర్టులో బెయిల్ పైన విచారణ జరగనుంది. దీంతో, ఈ రోజు సుప్రీంలో జరిగే వాదనలు..నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications