వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సుప్రీం'తో కొత్త ట్విస్ట్: బాబుపై సవాల్, రేవంత్ బయటపడ్తారా? కేసీఆర్‌పై పోరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్. రేవంత్ ఈ కేసు నుండి సులభంగా భయటపడతారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు ఓ కొత్త విషయం చెప్పారు!

చంద్రబాబు పైన అక్కసుతో తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. తెరాసకు మద్దతివ్వడం పైన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా యనమల ఓ విషయం చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ చెల్లదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.

స్టింగ్ ఆపరేషన్ చెల్లదని గతంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు తెలంగాణ టీడీపీ నేత మాగంటి గోపినాథ్ కూడా ఓ పత్రికతో చెప్పారని వార్తలు వచ్చాయి. అక్రమ కేసుల వల్ల రేవంత్‌కు ఏమీ కాదని, ఆయన బయటకు వచ్చాక ప్రభుత్వం పైన పోరాటం చేస్తారని చెబుతున్నారు.

Supreme told Sting operation not a legal method: AP Minister

మరోవైపు, చంద్రబాబు పైన తెరాస ప్రభుత్వం తాటాకు చప్పుళ్ల మాదిరి చేస్తోందని, వారికి భయపడమని టీడీపీ నేతలు చెబుతున్నారు. తెరాస ప్రభుత్వానికి దమ్ముంటే చంద్రబాబు వారి పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన రికార్డింగులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తాజా ట్విస్టుతో సుప్రీం కోర్టు తీర్పు ఏం చెప్పింది, రేవంత్ రెడ్డి ఈ కేసు నుండి బయటపడతారా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రేవంత్ జైలుకు వెళ్లేముందు మీసం తిప్పి మరీ తాను కేసీఆర్ పైన పోరాడుతానని చెప్పడం గమనార్హం.

English summary
Supreme told Sting operation not a legal method: AP Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X