సింగపూర్‌కు అమరావతి నిర్మాణం: చంద్రబాబు అవమానిస్తున్నారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశీయ ఇంజనీర్లను అవమానపరుస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆదివారం అన్నారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం దేశీయ ఇంజినీర్లను అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా ప్రధాని నరేంద్ర మోడీ పాలన సాగుతోందని విమర్శించారు. మంత్రులను అదుపు చేయలేని ప్రధని మోడీ అనవసర అంశాల పైన ట్వీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటా విఫలమయ్యాయన్నారు. వామపక్షాల పునరేకీకరణకు సిపిఐ కట్టుబడి ఉందన్నారు.

అర్చకులు, పీఠాధిపతులను సన్మానించిన టిఎస్సార్
రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి విశాఖలోని టిఎస్సార్ లలిత కళా పీఠం ఆధ్వర్యంలో అర్చకులు, వివిధ సంస్థల మఠాధిపతులను ఘనంగా సన్మానించారు. నిత్యం భగవంతుని సేవ చేస్తూ ప్రపంచ శాంతిని కాంక్షించే ఇటువంటి వారిని సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications