వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మాజీ భద్రతాధికారి సురేష్ రావు ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ సురేష్ రావు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కాల్చుకోగానే చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన మృతి చెందారు. ఆయన చాతిలో కాల్చుకున్నారు.

సురేష్ రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సురేష్ రావు గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సీఎస్ఓగా పని చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీగా పని చేశారు. ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా. కాగా, ఈయన మృతి పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నారు.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ కేసు నమోదు

Suresh Rao tries to commit suicide

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రాజెక్టు డైరెక్టర్లు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.

దీనిపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటుచేయగా, డీఎస్పీ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తుకోసం 22 మంది సీఐడీ, 37 మంది ఇతర విభాగాల అధికారులను కేటాయించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సీఐడీ ఏర్పాటయ్యాక తొలి కేసు ఇదే.

English summary
Intelligence Security Wing DSP Suresh Rao tries to commit suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X