అమరావతిలో జగన్ నిర్ణయానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్, కానీ..!!
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించవచ్చని పేర్కొంది. ఆర్ -5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్థానిక రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని పైన గత గత రాజధాని కేసులు విచారిస్తున్న బెంచ్ కు గతంలో ఈ కేసు బదిలీ చేసారు. అక్కడ ఈ రోజు విచారణ జరిగిన తరువాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్ 5 జోన్ లో ఇంటి స్థలాలు ఇవ్వచ్చని చెబుతూనే..హైకోర్టులో వచ్చే తుది తీర్పుకు కట్టుబడి ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది.

పేదలకు ఇంటి స్థలాలు
అమరావతి పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మందికి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు పైన అమరావతి రైతులు సుప్రీంను ఆశ్రయించారు. ఆర్ -5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను రైతులు కోరారు.అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు
సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఆర్- 5 జోన్‌పై తదుపరి విచారణ వరకూ స్టే ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది అభ్యర్దించారు. దీంతో, ఈ కేసును అమరావతి కేసులు విచారిస్తున్న బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నాడు రిజిస్ట్రీకి సూచించింది. బుధవారం సుప్రీంకోర్టులో తిరిగి ఈ అంశం పైన విచారణ జరిగింది. దీని పైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇంటి స్థలాలు ఇవ్వచ్చని చెబుతూనే హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో కొంత కాలంగా ఆర్ 5 జోన్ ఇంటి స్థలాల కేటాయింపు పైన కొనసాగుతున్న న్యాయ వివాదంలో ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి అడుగులు వేస్తోంది.

పేదలకు పంపిణీ
దాదాపు 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే రెండు విడతలుగా సీఆర్డీఏ భూ కేటాయింపులు చేసింది. ఈ నెల 18వ తేదీనే ముఖ్యమంత్రి ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా సమస్యలు లేకుండా పరిష్కారం దిశగా అడుగులు వేస్తూనే అటు స్థలాల కేటాయింపుకు చర్యలు ప్రారంభించిందది. ప్రభుత్వం ముందు నుంచి చేస్తున్న వాదనకు అనుగుణంగా ఇప్పుడు సుప్రీం కోర్టు అమరావతి పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అనుగుణంగా ఇచ్చిన తీర్పు తో ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు అడుగులు వేయనుంది. ఈ తీర్పు ద్వారా అమారవతి పరిధిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.












Click it and Unblock the Notifications