ఇక ఆపేయండి - బాలయ్యకు మద్దతుగా : రంగంలోకి స్వయంగా..!!

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. ఎటువంటి వివాదం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం ఇప్పుడు పొలిటికల్ రగడగా మారుతోంది. ఇదే సమయంలో బాలయ్య అక్కినేని..ఎస్వీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన అక్కినేని ఫ్యాన్స్..ఎస్వీఆర్ పైన చేసిన వ్యాఖ్యలతో కాపునాడు నేతలు ఆందోళన చేస్తున్నారు. కాపునాడు నేతలు బాలయ్యకు అల్టిమేటం జారీ చేసారు.

అక్కినేని నాగచైతన్య..అఖిల్ ఇద్దరూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. బాలయ్యకు వ్యతిరేకంగా అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పుడు ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. అనూహ్యంగా బాలకృష్ణ కు మద్దతుగా నిలిచారు.

అటు అక్కినేని ఫ్యాన్స్ నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే.. ఇప్పుడు ఎస్వీరంగారావు పై చేసిన కామెంట్స్ పై అయన మనవళ్లు ముందుకొచ్చారు. ఈ వివాదం పైన ఒక లేఖ విడుదల చేసారు. అందులో బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యల పైన ట్రోల్స్ వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

ఎస్వీఆర్ కుటుంబానికి బాలకృష్ణ కు మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తామంతా ఒకే కుటుంబంగా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన చాలా జనరల్ గా చెప్పారని వివరించారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించ లేదని ఎస్వీఆర్ మనవళ్లు రంగారావు, ఎస్ వి ఎల్ ఎస్ రంగారావు చెప్పుకొచ్చారు.

ఇక, ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవద్దని కోరారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి తమకు..తమ కుటుంబ సభ్యులకు..నందమూరి వంశానికి..నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులకు లేఖ ద్వారా సూచించారు. ఇప్పటి వరకు ఈ వివాదం పైన బాలయ్య స్పందించ లేదు.

SV Ranga Rao Grand Sons reacted on Balakrishna Controversy Comments, gave clarity

టీడీపీ నేతలు మాత్రం రాజకీయంగా ఈ అంశం పైన స్పందిస్తున్నారు. మంత్రి రోజా ఈ వివాదం పైన స్పందించాలని హీరో నాగార్జున ను డిమాండ్ చేసారు. ఇప్పుడు ఎస్వీఆర్ మనవళ్లు లేఖ ద్వారా వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు. ఇక.అక్కినేని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో .. బాలయ్య స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+