ముద్రగడతో పిఠాపురం వర్మ భేటీ- లోగుట్టు అదే

SVSN Varma: కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ మరోసారి తెర మీదికి వచ్చారు. ఆయన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారాయన. ఇక్కడ చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరును తెస్తున్నాయంటూ అసహనం తెలిపారు.

ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్‌లను కేటాయించిందని ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే.

SVSN Varma met Mudragada Padmanabham

దీంతో ఆయనకు కీలక పదవిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వర్మకు గన్ మెన్లను కేటాయించారనీ ఉదహరిస్తోన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ గానీ ఖండించకపోవడం, తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సమావేశం అయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా ఎస్వీఎస్ఎన్ వర్మ.. మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కొద్దిరోజుల కిందట ముద్రగడ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఇందులో నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోన్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శించారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, చిర్ల జగ్గిరెడ్డి, ఆకుల వీర్రాజు, చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, వంగా గీత, చలమలశెట్టి సునీల్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, యనమల కృష్ణుడు గారు, అంగూరి లక్ష్మీశివ కుమారి, జ్యోతుల నెహ్రూ, దౌవులూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా ముద్రగడ కుటుంబానికి అండగా నిలిచారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఆయనను కలిసి, పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+