బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
అనంతపురం: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.
హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఆయన ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

గత రెండు ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలకృష్ణ.. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గెలుపు సునాయాసమే అనుకున్నప్పటికీ.. తాజాగా, స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.
తనకు కూటమి నుంచి టికెట్ దక్కుతుందని ఆశించానని.. అయితే రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ఈ నియోజకవర్గంలో తనకు బలమైన పట్టుందని.. తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన ప్రభావం ఎంత ఉందనేది ఎన్నికల ఫలితాల రోజే తెలిసే అవకాశం ఉంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications