జేసీ ఆగడాలపై ప్రభుత్వం చర్యతీసుకోకపోతే...రాష్ట్రంలో మరిన్ని అరాచకాలు:ప్రబోధానంద అనుచరుడు బీజీ నాయుడు
హైదరాబాద్:స్వామి ప్రబోధానంద వర్సెస్ అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి వార్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. స్వామి ప్రబోధానంద తరుపున ఆయన అనుచరులు ఎంపి జెసిపై ధ్వజమెత్తుతుండగా...ఇవతలి వైపు స్వయంగా జెసినే స్వామి ప్రబోధానందపై దండెత్తుతున్నారు.
Recommended Video

స్వామి ప్రబోధానంద గురించి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్న ఎంపి జెసి దివాకర్ రెడ్డి పై ఆ స్వామీజీ అనుచరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ప్రబోధానంద ఆశ్రమం వద్ద దాడులకు పాల్పడింది జేసీ వర్గీయులేనని ఆశ్రమ కమిటీ నేత బీజీ నాయుడు ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాదు జెసి ఆగడాలకు అడ్డుకట్టవేయకపోతే రాష్ట్రంలో మరిన్ని అరాచకాలు జరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
స్వామి ప్రబోధానంద ఆశ్రమంపై ఎంపి జెసి దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణల నేపథ్యంలో స్వామీజీ అనుచరుడు, ఆయన ఆశ్రమ కమిటీ నేత బీజీ నాయుడు
ఒక టివి ఛానెల్ తో మాట్లాడుతూ...ఆశ్రమం దగ్గర అసలు జరిగింది వేరంటూ సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే జేసీ వర్గీయులే ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆశ్రమంలో తామంతా ప్రశాంతంగా ఉంటే తమపై రాళ్లు విసిరారని చెప్పారు.

ఆశ్రమం అంటే ఒక పుణ్యక్షేత్రం అని...అది ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగట్లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తమ ఆశ్రమంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వారిలో జెసి బ్రదర్స్ ముఖ్యలని, ఎన్నికల సమయంలో బీజేపీ నేతలకు ప్రబోధానంద స్వామి వారు ఆశ్రమం కల్పించినందుకే జేసీ సోదరులు వారిపై పగ పెట్టుకున్నారని వివరించారు.
ఇక అప్పటి నుంచి జేసీ తమ ఆశ్రమంపై దాడులు చేయిస్తూనే ఉన్నాడని...దీంతో జేసీని ఎదుర్కోలేక స్వామి ప్రబోధానంద కర్ణాటక వెళ్లిపోయారని వెల్లడించారు. అక్కడ మళ్లీ ఆర్థికంగా బాగా స్థిరపడ్డాక తిరిగి అనంతపురం రావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలోనే స్వామి ప్రబోధానంద కుమారుడు హత్యకు గురయ్యాడని ఆయన తెలిపారు.
తమ ఆశ్రమం చుట్టూ ప్రహారీ ఉంటుందని, అంతే తప్ప ఎవరినీ లోనికి రానివ్వరన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆశ్రమం ఎప్పుడూ తెరిచే ఉంటుందన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఆశ్రమాన్ని చూడొచ్చాన్నారు. అసలు తమ ఆశ్రమం వద్ద జరిగిన దాడులలో ముందుగా దాడులకు పాల్పడింది ఎవరో, వాటికి సంబంధించిన విజువల్స్ కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. జేసీ ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే...ఇలాగే ఉపేక్షిస్తే మరిన్ని అరాచకాలు సృష్టించవచ్చని బిజి నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రబోధానంద స్వామి దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఎంపి జెసి దివాకర్ రెడ్డి బుధవారం అమరావతిలో మీడియాకు ప్రదర్శించారు. ప్రబోధానంద వల్ల మోసపోయామంటున్న బాధితుల కథనాల వీడియోలను కూడా ఆయన ప్రదర్శించారు. దేవుళ్లను బూతులు తిట్టేవాడు స్వామా...ఈయనకు ఏం పోయేకాలం వచ్చిందోనని జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడటం గమనార్హం.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications