ఏపీలో పెన్షన్ దారులకు పండుగ.. వారికి నాలుగు వేలు పించన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు తీపి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈ ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి 4000 చొప్పున పింఛన్ అందించాలని నిర్ణయించింది. అయితే ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ జూన్ నుండే ఇవ్వాలని భావించినప్పటికీ అది కుదరకపోవడంతో నుంచి ఆగస్ట్ నుండి ప్రతినెల వారికి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు.
పింఛన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు
నేటినుండి పింఛన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలను ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా స్పౌజ్ కేటగిరీ పింఛన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న క్రమంలో భాగంగా ఈ విధంగా చేస్తోంది. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన భార్యలకు స్పౌజ్ పింఛన్ కింద ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వితంతువులకు ఈ పెన్షన్లు అందడం లేదు.

స్పౌజ్ క్యాటగిరి పెన్షన్లు
దీని విషయంలో చొరవ చూపిన ఏపీ ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లను అందిస్తోంది. ఆగస్టు నెలలో పింఛన్ల కోసం ప్రభుత్వం 2750 కోట్లు రిలీజ్ చేయగా స్పౌజ్ క్యాటగిరికి సంబంధించి పింఛన్ కోసం ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఈ నెల నుంచి స్పౌజ్ క్యాటగిరి పెన్షన్లను అందజేస్తుంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే మరి భార్యలకు మరుసటి నెల నుంచి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు
అయితే ఆ విధంగా చాలామందికి పింఛన్ రాకపోవడంతో, అలాంటి వారందరినీ గుర్తించి ప్రస్తుతం వారందరికీ స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేస్తోంది. ఈ స్పౌజ్ కేటగిరీ కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు.
చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలకు బదిలీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ క్యాటగిరి లో కూడా పింఛన్ పథకాన్ని తీసుకువచ్చి 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలకు బదిలీ చేసింది. మొత్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్పౌజ్ కేటగిరి పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తూ వారికి భరోసా కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications