గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింథటిక్ డ్రగ్స్ కలకలం: ముగ్గురు బీటెక్ విద్యార్థుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: నగరంలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపింది. నగర శివారులోని గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. మత్త మందు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా బీటెక్ విద్యార్థులు కావడం గమనార్హం.

నిందితుల నుంచి 25 ట్రమడాల్ మాత్రలు, 25 గ్రాముల ఎల్ఎస్డీ వ్రాపర్స్, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందులతోపాటు రూ. 24,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితు లఅరెస్ట్ వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ వెల్లడించారు. ముగ్గురు విద్యార్థులు టెలిగ్రామ్ ఆన్‌లైన్ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

 Synthetic drugs: three b tech students arrest in guntur

ఏపీ ఫైబర్ నెట్‌లో అవకతవకలు

గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ పలువుిరికి నోటీసులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ ఫ్ట్రాక్చర్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సాంబశివరావు, టెక్నికల్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన హరిప్రసాద్‌కు నోటీసులు పంపింది. నోటీసులు అందినందున విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో వాళ్లిద్దరూ విచారణకు హాజరయ్యారు. తమపై వచ్చిన ఆరోపణలపై సీఐడీకి వివరణ ఇచ్చామని, విచారణకు సహకరిస్తామని తెలిపారు.

11 జిల్లాల్లో చలాన్ల అక్రమాలు

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలానాల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నకిలీ చలానాలకారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 9.26 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5.08 కోట్లు రినకవీ చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా 11 జిల్లాల్లో 41 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాలను గుర్తించామని మంత్రి తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై 44 కేసులు, 29 మందిప శాఖాపరమైన చర్యలు, 9 మందిని సబ్ రిజిస్ట్రార్ విధుల నుంచి తప్పించినట్లు చెప్పారు. నకిలీ చలానాల బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దోపిడీ దొంగల కలకలం...

కృష్ణాజిల్లా మైలవరం మండలంలోని పుల్లూరు గ్రామం వద్ద జరిగిన లారీ దారి దోపిడీ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లా చొల్లంగిలో రెండు లారీలు ధాన్యం దిగుమతి చేసి వస్తుండగా దొంగలు తెగబడ్డారు. బియ్యం అమ్మగా వచ్చిన నగదు మొత్తాన్ని దొంగలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాలో మైలవరం మండలం పుల్లూరులో దారి దోపిడీ జరిగింది.

మండపేటలో పీడీఎస్‌ బియ్యం విక్రయించిన ఇద్దరు లారీ డ్రైవర్లు బియ్యం అమ్మిన 7 లక్షల రూపాయల సొమ్మును ఓ లారీ డ్రైవర్‌కు అప్పగించారు. అయితే.. ఆ 7 లక్షల సొమ్ముపై మరో లారీ డ్రైవర్ కన్నేసాడు. ఖమ్మం జిల్లాకు చెందిన దోపిడీ ముఠాతో డ్రైవర్ కుమ్మక్కై 7 లక్షల నగదును దోపిడీ చేశారు. ఈ ఘటన అనంతరం మరో డ్రైవర్ మైలవరం పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు లారీ డ్రైవర్‌లపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలో స్పెషల్ టీమ్‌తో దోపిడీ ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Recommended Video

Megastar Chiranjeevi ఆక్సిజ‌న్ బ్యాంకులు స్టార్ట్, Ram Charan పర్యవేక్షణ || Oneindia Telugu

దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తుల ముఠా ఖమ్మం జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దొంగతనం జరిగిన సొమ్ము 7 లక్షలను రికవర్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ మీడియాకు వెళ్లారు. ఇదిలా ఉండగా దోపిడీకి గురైన లారీ మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉండగా సదరు లారీలో కొంత రేషన్ బియ్యం ఉంది. రేషన్ బియ్యాన్ని అమ్మి, డబ్బు పోయే సరికి ధాన్యం అంటూ ఫిర్యాదు చేసి పోలీసులను ప్రక్క దారి పట్టిస్తున్నారా? అనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

English summary
Synthetic drugs: three b tech students arrest in guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X