టి.సుబ్బరామిరెడ్డి దివాలా?
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డిపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుమీద తీసుకున్న రుణానికి సంబంధించి హామీదారుగా టి.సుబ్బరామిరెడ్డి ఉన్నారు. దివాలా ప్రక్రియ ప్రారంభించి రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని బీవోఎమ్ ncltలో పిటిషన్ వేసింది.
సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా సుబ్బరామిరెడ్డి, బంధువులు, సన్నిహితులు టి.సరితారెడ్డి, టి.వి.సందీప్ రెడ్డి, జె.సుశీలారెడ్డి, జి.సులోచన, జి.శివకుమార్ రెడ్డి తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.6వేల కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమయ్యాయి.

రుణాలు ఇచ్చిన సంస్థలు, కంపెనీ నిర్వహణకు రుణమిచ్చిన సంస్థలు ఎన్ సీఎల్ టీని ఆశ్రయించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.400 కోట్లకుపైగా, ఎస్‌బీఐ నుంచి రూ.240 కోట్లకుపైగా ఈ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐలు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ బి.ఎన్.వి.రామకృష్ణ, సాంకేతిక సభ్యులు సత్యరాజన్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. వివిధ ప్రాజెక్టుల నిర్వహణలో సహకరించినందుకు బకాయిలు చెల్లించడంలేదని గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై కటారియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కునాల్ కొంచం ప్రైవేట్ లిమిటెడ్ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలంటూ పిటిషన్లు దాఖలు చేశాయి. కెనరా బ్యాంకు కూడా దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications