కారుణ్యమరణాలకు అనుమతివ్వండి; గవర్నర్ కు పోస్ట్ కార్డులు రాసి షాకిచ్చిన ఏపీలోని రైతులు!!
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల్లోని వ్యవసాయ భూములపై విధించిన యూ-1 జోన్ ను ఎత్తివేయాలని బాధిత రైతులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. యూ-1 రిజర్వ్ జోన్ ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న రైతులు తమ సమస్యల సాధన కోసం నిర్విరామంగా పోరాడటానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని లేఖలు రాసి షాక్ కు గురి చేశారు.

తాడేపల్లి పరిధిలోని భూములలో యూ-1 జోన్, భూముల క్రయవిక్రయాలపై నిషేధం
ప్రభుత్వ నిబంధనలతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని ఏపీకి చెందిన తాడేపల్లి పరిధిలోని రైతులు ఏపీ గవర్నర్ కు పోస్టు కార్డులు రాయడం సంచలనంగా మారింది. రాజధాని అమరావతి కోసం తాడేపల్లి పరిధిలోని అమరా నగర్ కు చెందిన 178 ఎకరాలను ప్రభుత్వం యూ-1 జోన్ క్రిందకు తీసుకువచ్చింది. ఇక ఈ మేరకు ఈ భూములలో ఎటువంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించింది గతంలోని టిడిపి ప్రభుత్వం.

వైసీపీ హామీ ఇచ్చి నెరవేర్చలేదని యూ-1 జోన్ తొలగింపు కోసం ఆందోళన
అయితే ఈ జోన్ ను తొలగించాలని టిడిపి ప్రభుత్వ హయాం నుంచి ఈ ప్రాంత రైతులు ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక గత ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే యూ -1 జోన్ ను తొలగిస్తామని వైసిపి రైతులకు హామీ ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం యూ-1 జోన్ తొలగించడంలో చేస్తున్న జాప్యం వల్ల ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కారుణ్య మరణాల కోసం గవర్నర్ కు పోస్టు కార్డులు రాసిన రైతులు..
గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పోస్ట్ కార్డులు వ్రాసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు కారుణ్య మరణాలను ప్రసాదించాలి అంటూ ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 2019 ఎన్నికలలో యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ని కలిసి అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. ఇక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని సైతం కలిసి వారు తమ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు.

తమ భూములు అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన
అధికారంలోకి
వచ్చిన
తర్వాత
రెండు
నెలల్లోనే
యూ-1
జోన్
ఎత్తివేస్తామని
హామీ
ఇచ్చి
నెరవేర్చలేదని,
ఈ
కారణంగా
జాతీయ
రహదారి
సమీపంలో
ఉన్న
తమ
భూములను
అవసరాలకోసం
అమ్ముకోలేక
పోతున్నామని
రైతులు
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నారు.
ఆందోళన
చేస్తున్న,
ఆత్మహత్యలు
చేసుకోవడానికి
అనుమతించాలని
కోరుతున్న
రైతులలో
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీకి
చెందిన
వారు
కూడా
ఉండటం
గమనార్హం.
మరి
రైతుల
ఆందోళనలు
తీవ్రతరం
అవుతున్న
నేపధ్యంలో
అయినా
ప్రభుత్వం
స్పందిస్తుందా
అనేది
తెలియాల్సి
ఉంది.