వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నియోజకవర్గం సీఎం జగన్ చేయిదాటిపోయింది!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో కేవ‌లం ఒకే ఒక్క ప‌ద‌వి చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచ‌రులుగా తాడికొండ‌లో ఆమెకు మ‌ద్ద‌తుగా ర్యాలీకి సిద్ధ‌మై రోడ్డుమీద‌కు వ‌చ్చారు. వారికి పోటీగా నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ వ‌ర్గీయులు కూడా రోడ్డుమీద‌కు చేరారు. ఎమ్మెల్యేకు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే అనుచ‌రులు, డొక్కాకు మ‌ద్ద‌తుగా డొక్కా అనుచ‌రులు పోటీపోటీగా నినాదాలు ప్రారంభించారు.

 పోలీసుల మాట వినని ఇరువర్గాలు

పోలీసుల మాట వినని ఇరువర్గాలు


క్ర‌మేణా ప‌రిస్థితి తీవ్ర‌రూపం దాలుస్తుండ‌టంతో వెంట‌నే పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఇరువ‌ర్గాల‌ను శాంతింప చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవడంతో ర్యాలీల‌కు ఎవ‌రికీ అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించారు. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని ఎమ్మెల్యే శ్రీదేవి అనుచ‌రుల‌కు, డొక్కా అనుచ‌రుల‌కు న‌చ్చ‌చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వారు విన‌లేదు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అనుమ‌తి లేద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ ఇరువ‌ర్గాలు పోలీసుల మాట విన‌క‌పోతుండ‌టంతో తాడికొండ మొత్తం భారీగా పోలీసుల‌ను మొహ‌రించారు.

 డొక్కాను నియమించిన తర్వాత భగ్గుమన్న విభేదాలు

డొక్కాను నియమించిన తర్వాత భగ్గుమన్న విభేదాలు


తాడికొండ ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొద్దిరోజుల క్రితం అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి డొక్కాను నియ‌మించారు. తాను తెప్పించుకున్న స‌ర్వేల ప్ర‌కారం ఇక్కడి ఎమ్మెల్యేపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో ఇక్క‌డ పార్టీ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే అంచ‌నాతో అభ్య‌ర్థిని మార్చే ఉద్దేశంలో ఉన్నారు. అందులో భాగంగానే డొక్కాను నియ‌మించారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి.

అధిష్టానం జోక్యం చేసుకోవాలి..

అధిష్టానం జోక్యం చేసుకోవాలి..


మేడికొండూరులో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే శ్రీదేవి అనుచ‌రులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా అనుమ‌తి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న డొక్కాతో అధికారాన్ని ఎలా పంచుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీ‌దేవి ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌లే ఆమె వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశారు. అప్ప‌టి నుంచి రెండువ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఉంది. అధినాయ‌క‌త్వం జోక్యం చేసుకుంటేనే ఇక్క‌డి ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణుగుతాయ‌ని, లేదంటే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే వాతావ‌ర‌ణం కొన‌సాగితే పార్టీకి గ‌డ్డుప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని వైసీపీ అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
As followers of MLA Sridevi, they prepared for a rally in Tadikonda and came on the road in support of her.In competition with them, the constituency additional in-charge and former minister Dokka Manikyavaprasad also joined the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X