టీడీపీ ఎమ్మెల్యేకి సారీ చెప్పిన సీఐ, ఇంకా వైసీపీకి చెక్క భజన చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లోని అధికారులు అందరూ పలు ప్రాంతాలకు బదిలీ అవుతున్నారు. ముఖ్యంగా పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు భారీ ఎత్తున బదిలీ అవుతున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టీడీపీ ఎమ్మెల్యేకి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ అయింది.
టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి తాను ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అంటూ సీఐ వివరణ కూడా ఇచ్చారు. తాడిపత్రి రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలవడం తీవ్రచర్చకు దారి తీసింది. జిల్లా ఎస్పీతో మాట్లాడిన తర్వాత సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.

అనంతపురం జిల్లా ఎస్పీని ఎందుకు కలిశారు అని మీడియా ప్రశ్నించగా అది పోలీస్ శాఖకు సంబంధించిన విషయమని, పోలీసు శాఖకు పంబంధించి తాను జిల్లా ఎస్పీతో చర్చలు జరిపామని సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి అంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి తాను సారీ చెప్పిన మాట నిజమేనని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో తాను దురుసుగా ప్రవర్తించలేదని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
గత 14 నెలలుగా తాను తాడిపత్రి రూరల్ సీఐగా పనిచేస్తున్నానని, ఎప్పుడూ తాను ఏకపక్షంగా వ్యవహరించలేదని, నాయకుల నుంచి తనకుగాని, తన వలన ప్రజలకు కానీ, నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాలేదని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మంగళవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. పోలీసులు ఇంకా వైసీపీ నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

ఆ సమయంలో తాను తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో దురుసుగా ప్రవర్తించలేదని, ఆ విషయంలో తన తప్పు ఏమీ లేదని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు. అయితే శాంతిభద్రతలకు సమస్య వస్తుందని తాను టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి సారీ చెప్పానని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు. తన మీద శాఖా పరమైన చర్యలు తీసుకుంటే అందుకు తాను కట్టుబడి ఉంటానని సీ లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు.
తన పై అధికారుల మాటకు తాను గౌరవం ఇస్తానని తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు. అయితే తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిని వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని తాడిపత్రి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఇంకా వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని, ఆయనప చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాడిపత్రిలోని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications