నేను తల్చుకుంటే చంద్రబాబు ఇల్లు కదలగలడా? తలసాని

హైదరాబాద్: తాను తల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు కదలగలడా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదని, హైదరాబాద్ కూడా తెలంగాణలోనే ఉందని తెలుగుదేశం నేతలు గుర్తించాలని అన్నారు. నేతలే టిఆర్ఎస్‌లో చేరారు, క్యాడర్ మాత్రం చేరలేదని చెబుతున్న టిడిపి నేతలు.. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదుకు వచ్చిన ఆదరణ చూడాలని సూచించారు.

Talasani lashed out at Chandrababu

తమ పార్టీ టికెట్‌పై గెలిచి టిఆర్ఎస్‌లో చేరిన నేతలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్న టిటిడిపి కార్యకర్తలు చావు డప్పు మోగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సనత్‌నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తలసాని మరోసారి ప్రకటించారు. అదే సమయంలో టిడిపి అభ్యర్థి ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు సవాల్ విసిరారు. నోటీ మాటలతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందామని తలసాని సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+