అవమానించారు: టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై తమన్నా సింహాద్రి ఫిర్యాదు
విజయవాడ: చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి సోమవారం విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video

ఎంపీ శివప్రసాద్‌పై హిజ్రాల ఫిర్యాదు
పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలో భాగంగా స్వలింగ సంపర్కుల వేషధారణలో ఉన్న శివప్రసాద్.. ట్రాన్స్ జెండర్ అని చెప్పడం దారుణమని అన్నారు. తాము మహిళలతో సమానమని ఆమె అన్నారు.

శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు నంద్యాలలోనూ పలువురు హిజ్రాలు ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications