జల్లికట్టుకు ఏం సంబంధం: పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు తెలుగు సంస్థ చీఫ్
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తమిళనాడు తెలుగు యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తమిళనాడు తెలుగు యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. జల్లికట్టు ఉద్యమానికి, ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. హోదా వల్ల వచ్చే లాభాలు ఏమిటో జగన్, పవన్‌లు చెప్పాలని నిలదీశారు.

ప్రత్యేక హోదా సాధ్యం కాదు: టిజి వెంకటేష్
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ మాత్రమే సాధ్యమవుతుందని టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లోకసభలో బీజేపీకి మెజారిటీ ఎక్కువగా ఉండటం వల్లే ప్యాకేజీకి మద్దతు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. ఏపీకి సరిపడా ప్యాకేజీ తప్పక సాధిస్తామని, ఒకవేళ సరిపడా ప్యాకేజీ అందకుంటే కేంద్రంపై యుద్ధం తప్పదన్నారు.












Click it and Unblock the Notifications