ఇద్దరు ముఖ్యమంత్రుల నోట ఓకే మాటకి కారణం అదేనా ?
పిల్లలను కనండి ప్లీజ్ అంటూ ఒకరు కాదు కాదు ఏకంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాటల్లో ఆంతర్యం ఏమిటని జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా ఏ సభలో మాట్లాడినా సరే పిల్లలను కంటేనే మనం బాగుంటాం.. దేశం బాగుంటుందని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే స్థానిక సంస్థల్లో పోటీ చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ గా నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొత్తగా పెళ్లైన జంటలు త్వరగా పిల్లల్ని కనాలని కోరారు. నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే చెప్పానని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని వెల్లడించారు. వారికి మంచి తమిళ పేర్లు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రుల మాటలను పరిశీలిస్తే ఏపీలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పని చేసేందుకు మానవ వనరులు తగ్గే ప్రమాదం ఉంది. రాష్ట్రం కోసం విజన్ 2047 అంటున్న చంద్రబాబు.. అందుకే పిల్లలను కనాల్సిందేనని పిలుపునిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ కూడా లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనలో తమిళనాడులో సీట్లు తగ్గకుండా ఉండేందుకు ఇలా మాట్లాడారని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన వ్యవహారంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడులోని డీఎంకేకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని సీఎం వాపోయారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే పిల్లలని కనాలని కోరారు.
అంతకు ముందు కూడా కొళత్తూర్ లోని ఓ వివాహ వేడుకలో పాల్గొన్న క్రమంలో ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టాం. కానీ, దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జనాభా ఆధారంగా పునర్విభజన ఇది జరిగితే రాష్ట్రంలో 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications