సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ - సాహసమే: ప్రత్యర్ధులపై బ్రహ్మాస్త్రం..!?

ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. వైనాట్ 175 సీఎం జగన్ నినాదం. ఏడాదిన్నార ముందుగానే తన ఎన్నికల సైన్యాన్ని సిద్దం చేసుకున్న సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఒక వైపు సోషల్ ఇంజనీరింగ్.. మరో వైపు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మూలాలను దెబ్బ తీసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో తన విశ్వసనీయత పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగానే మరో సంచలన నిర్ణయానికి సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఎన్నికల వేళ ఆ నిర్ణయం ప్రతిపక్షాలపైన బ్రహ్మాస్త్రంగా మారనుంది. అదే జరిగితే సాహసమే అవుతుంది.

మేనిఫెస్టోలో హామీల అమలుకు ప్రాధాన్యత

మేనిఫెస్టోలో హామీల అమలుకు ప్రాధాన్యత


ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం అమలుకు ఆలోచన చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో తన హామీలను మేనిఫెస్టో రూపంలో ముందుకు తెచ్చారు. అందులో ఇప్పటికే 95 శాతం హామీలను అమలు చేసామని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తమ పాలనకు తాము ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోనే తమకు భగవద్గీత..ఖురాన్..బైబిల్ అంటూ చెప్పుకొచ్చారు. మెనిఫెస్టోలో చెప్పిన వాటిల్లో దశల వారీగా మద్యపాన నిషేధ్.. సీపీఎస్ రద్దు వంటివి పెండింగ్ లో ఉన్నాయి. సంక్షేమ పథకాలు.. నవరత్నాల రూపంలో అమలు కొనసాగుతున్నాయి. ఇక, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. జగన్ తన సంక్షేమం తిరిగి గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ -జనసేన కలిస్తే రాజకీయంగా మారే సమీకరణాలపైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కౌంటర్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూనే..టీడీపీ అధినేత చంద్రబాబు మూలాలను దెబ్బ కొట్టే ప్రణాళికలను ముమ్మరం చేసారు.

ఎన్నికలకు ముందు.. మద్యపాన నిషేధం..!

ఎన్నికలకు ముందు.. మద్యపాన నిషేధం..!

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విపక్షాలు మధ్యపాన నిషేధం హామీ పైన విమర్శలు కొనసాగిస్తున్నారు. సంక్షేమ పధకాలన పేరుతో అమ్మ ఒడి - నాన్న బుడ్డి అంటూ ప్రభుత్వం పైన సెటైర్లు వేస్తున్నారు. మద్యం నియంత్రిస్తామని చెబుతూ.. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. పదేపదే మద్యం బ్రాండ్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నారు. మద్యం ధరలు పెంచి వినియోగం తగ్గేలా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వంలోని నేతలు చెబుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు మద్యపాన నిషేధం పైన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల వేళ మద్యపాన నిషేధం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం చర్చల దశలో ఉందని.. ఎన్నికల ముందు దీని పైన తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీంతో, ఈ నిర్ణయమే జరిగితే ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడటం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు లక్ష్యంగా..విశ్వసనీయత దెబ్బ తీసేలా

చంద్రబాబు లక్ష్యంగా..విశ్వసనీయత దెబ్బ తీసేలా

నిజంగా హామీ ఇచ్చిన విధంగా మద్యపాన నిషేధం అమలుకు నిర్ణయిస్తే ముఖ్యమంత్రిది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. ప్రస్తుతం కరోనా..సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఆర్దికంగా సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో, మద్యపాన నేషధం హామీ అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కానీ, సీఎం జగన్ ఇప్పుడు తన హామీ అమలు దిశగానే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధిస్తే..చంద్రబాబు సీఎం కాగానే మద్యపాన నిషేధం ఎత్తివేసారని వైసీపీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు మహిళలే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. మద్యపాన నిషేధం అమలు దిశగా నిర్ణయం తీసుకుంటే.. మహిళల ఓట్ బ్యాంక్ ఓన్ చేసుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో తన విశ్వసనీయత పెంచుకొనేందుకు సీఎం జగన్ కు ఇది దోహదం చేస్తుందంటున్నారు. ఎన్నికల వేళ ఇది బ్రహ్మాస్త్రంగా మారుతుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+