కేంద్రంలో కింగ్ మేకర్ గా జగన్, ఆ ఇద్దరూ కలిస్తే - ఢిల్లీలో కీలక మలుపు..!?
కేంద్రంలో..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల..వ్యతిరేక కూటమిలో ఎవరెవరు అనేది స్పష్టత వచ్చింది. వరుసగా మూడో సారి అధికారం దక్కించుకోవాలనేది ప్రధాని మోదీ వ్యూహం. అడ్డుకోవటం ప్రత్యర్ధి పార్టీల లక్ష్యం. ఈ రెండు భేటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే హాజరైంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మారతున్న సమీకరణాల్లో ఇప్పుడు సీఎం జగన్ పాత్ర కీలకంగా కనిపిస్తోంది.
రెండు కూటములపై క్లారిటీ : వచ్చే ఎన్నికలను అటు బీజేపీ..ఇటు బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బెంగళూరులో ఇండియా పేరుతో 26 పార్టీలు సమావేవశమయ్యాయి. ఆ వెంటనే ఢిల్లీలో 38 పార్టీలతో ఎన్డీఏ సమావేశం జరిగింది. విపక్ష కూటమిలో ప్రస్తుతం పార్లమెంట్ లో సీట్ల మేరకు కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఉంది.

అదే విధంగా ఎన్డీఏలో బీజేపీ 303 సీట్లతో ఉంది. మిగిలిన పార్టీల్లో శివసేన, ఎన్సీపీ నుంచి చీలిన పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి కొత్త పార్టీలు ఎన్డీఏలో చేరాయి. అటు తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే హాజరైంది. టీడీపీకి ఆహ్వానం లేదు.
మూడు రాష్ట్రాల సీఎంలు కీలకం : ఇప్పుడు ఈ రెండు కూటములకు ఏపీ, తెలంగాణ, ఒడిశాలోని అధికార పార్టీలు దూరంగా ఉన్నాయి. జేడీఎస్, బీఎస్పీ,టీడీపీ పార్టీలు రెండు కూటముల సమావేశాలకు హాజరు కాలేదు. ఇందులో ప్రస్తుతం పార్లమెంట్‌లో బలాబాలను చూస్తే లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ లోక్‌సభ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏ కూటమితోనూ కలిసేందుకు సిద్దంగా లేరు. నవీన్ పట్నాయక్..వైఎస్ జగన్ ఇద్దరూ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీకి రానున్న రోజుల్లో ఎన్డీఏలోకి అవకాశం వస్తుందా రాదా అనేది తేలాల్సిన అంశం. ఇప్పటి వరకు ఏపీ లో టీడీపీ, వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో మద్దతు లభిస్తూనే ఉంది.

కింగ్ మేకర్లుగా మారే అవకాశం : ఇక రానున్న ఎన్నికల్లో రెండు కూటమిల మధ్య హోరా హోరీ పోరు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రతీ సీటు కీలకం కానుంది. ఏపీలో 25, తెలంగాణలో 17, ఒడిశాలో 21 లోక్ సభ సీట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం బీజేడీకి 12 మంది లోక్ సభలో, 10 మంది రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. అదే విధంగా కర్ణాటక, యూపీలోనూ తటస్థ పార్టీలు ఉన్నా అక్కడ కాంగ్రెస్ - బీజేపీ మధ్య పోరు ప్రధానంగా ఉంటుంది.
ఈ సమయంలో తటస్థంగా ఉన్న జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్. ఎన్డీఏలో కలవకపోతే చంద్రబాబు కు వచ్చే సీట్లు 2024లో కేంద్రంలో అధికారం డిసైడ్ చేసే విషయంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. సర్వేలు అంచనా వేస్తున్నట్లుగా వైసీపీ తిరిగి 20కి పైగా లోక్ సభ సీట్లు సాధించి, కేసీఆర్ - నవీన్ మద్దతుగా నిలిస్తే జగన్‌తో పాటుగా ఈ ఇద్దరు కింగ్ మేకర్స్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications