అచ్చెన్నాయుడుని ఢీ కొట్టేందుకు ఆమె రెడీ!!
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఢీ కొట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారా? అందుకు రంగంలోకి ఓ మహిళా నేతను దింపబోతున్నారా? శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి అచ్చెన్నాయుడుతో వైసీపీ హోరాహోరీగా పోరు చేసేందుకు సిద్ధమవుతోందా? అంటే తాజా పరిణామాలతో అవును అన్న సమాధానమే వస్తుంది.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతగా గుర్తించబడిన కింజరాపు అచ్చెన్నాయుడు కు చెక్ పెట్టడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికలలో ఆయనపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి రెడీ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణిని నియమించింది.

అంతకు ముందు టెక్కలి అసెంబ్లీ సమన్వయ కర్తగా వాణి భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉండగా, జగన్ ఆయన స్థానంలో వాణికి బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఎన్నికలలో అచ్చెన్నాయుడు పై వాణి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పై మహిళా నేతలు ఎన్నికల బరిలోకి దింపి వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాలని వైసిపి భావిస్తోంది.
టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం . అందుకే టెక్కలిలో పట్టు సాధించడం కోసం, బలంగా ఎదగడం కోసం గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా 2021 లో అవకాశం కల్పించారు. ఆపై టెక్కలి నుండి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించినప్పటికీ, తాజా పరిణామాలతో జగన్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

అధికారికంగా ఇప్పుడు దువ్వాడ వాణికి టిక్కెట్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ప్రకటించడంతో దువ్వాడ వాణి ఇప్పటికే నియోజకవర్గంలో రాజకీయం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అచ్చెన్నాయుడు కు చెక్ పెట్టడానికి మహిళా కార్డు వాడాలని చూస్తున్న వైసిపి ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications