అనిత కు సీటు లేనట్లేనా : అమరావతిలో అసమ్మతి గళం : బాబు కీలక నిర్ణయం..!
మొదటి సారి గెలిచినా..తన నియెజకవర్గానికే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత. ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన అనితకు ఈ సారి టిక్కెట్ దక్కటం అనుమానంగానే కనిపిస్తోంది. అసమ్మతి పెద్ద ఎత్తున గళం విప్పింది.

అనిత వద్దు..టిడిపి ముద్దు..
టిక్కెట్ల ఖరారు లో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పై సమీక్షలు నిర్వహించారు. విశాఖ పరిధిలోని సిట్టింగ్ లకు దాదాపు తిరిగి టిక్కెట్లను ఖరారు చేసారు. అయితే, పాయకరావు పేట సిట్టింగ్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. కొద్ది రోజుల్లోగా సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సీటు ఈ సారి ఇవ్వద్దంటూ పార్టీలోని వ్యతిరేక గ్రూపులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అనిత వద్దు..టిడిపి ముద్దు అనే నినా దంతో ప్రదర్శనలు నిర్వహించాయి. టిక్కెట్ల పై సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఏకంగా అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద వారు తమ ఆందోళన కొనసాగించారు. అనితకు సీటు ఇస్తే పార్టీ ఓడిపోతుందని..అవినీతి కి పాల్పడిన అనిత కు సీటు ఇవ్వదని వారు డిమాండ్ చేసారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. దీని పై సీయం సైతం వివరాలు సేకరించారు.

టిక్కెట్ ఇస్తే..ఓడిపోతాం..
పాయకరావు పేటలో సాగిన ఆందోళనలు అమరావతి లో కొనసాగాయి. సమన్వయ కమిటీ భేటీలోనే అనిత అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. ఎమ్మెల్యే అనినీతి తారస్థాయికి చేరుకుందని, మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే ఘోరంగా ఓటమి పాలవడం ఖాయమని సమన్వయ కమిటీ భేటీలో నేతలు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యే అనిత- అసమ్మతి నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఎమ్మెల్యే ఏ కప క్షంగా వ్యవహరిస్తోందని, నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదం టూ అసమ్మతి నేతలు ఫిర్యాదుచేశారు.

మళ్లీ గెలుస్తానంటూ అనిత చెప్పుకొచ్చారు
వారు చెప్పేవన్ని అబద్ధాలేనని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈసారి మళ్లీ గెలుస్తానంటూ అనిత చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి అసమ్మతి నేతల వాదన కాదని అనితకు సీటు ఇస్తారా..లేక అనితను కాదని మరొకరికి సీటు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications