నంద్యాలలో టిడిపి కార్యకర్తల కిడ్నాప్, వైసిపి నేతపై ఆరోపణ, ఉద్రిక్తత

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి, వైసిపిలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. మరోవైపు, శుక్రవారం టిడిపి కార్యకర్తల కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది.

దగ్గుబాటీ! ఏ పార్టీ తరఫున, రాజకీయ నిరుద్యోగి, బాబు నీకూ నీళ్లిచ్చారు: దేవినేని

నలుగురు టిడిపి కార్యకర్తల కిడ్నాప్

నలుగురు టిడిపి కార్యకర్తల కిడ్నాప్

తమ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. నలుగురు కార్యకర్తలను కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

బుడ్డా శేషారెడ్డి వాహనాన్ని అడ్డుకున్న టిడిపి

బుడ్డా శేషారెడ్డి వాహనాన్ని అడ్డుకున్న టిడిపి

అదే సమయంలో అటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డా శేషారెడ్డి వాహనం వచ్చింది. దానిని టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తప్పనిసరిగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు

కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు

టిడిపి కార్యకర్తలను కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని బుడ్డా శేషారెడ్డి అన్నారు. ఓ చోట నలుగురు అనుమానాస్పదంగా తిరిగినట్లు కనిపించారని, కానీ వారు టిడిపి కార్యకర్తలో ఎవరో తమకు తెలియదన్నారు. వారిని ఎవరు తీసుకు వెళ్లారో తమకు తెలియదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party activists on Friday alleged that YSR Congress party leaders obducted their party leaders in Nandyal.
Please Wait while comments are loading...