TDP, జనసేన వ్యూహాత్మక ఎత్తుగడ

వచ్చే ఎన్నికల్లో దాదాపుగా పొత్తు పెట్టుకొని పోటీచేయడం టీడీపీ, జనసేన మధ్య ఖాయమైంది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఆయన ప్రసంగాల్లో గతంలో కంటే ఇప్పుడు కచ్చితత్వంగా, ముక్కుసూటిగా విషయాన్ని చెప్పేస్తున్నారు. అలాగే పొత్తుల గురించి కూడా ఆయన రణస్థలంలో స్పష్టత ఇచ్చారు. ఒంటరిగా వెళితే బలం సరిపోదని, గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడంవల్ల 54 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోగలిగిందని తెలిపారు.

ఒంటరిగా పోరాడే శక్తి మీరిస్తారా?

ఒంటరిగా పోరాడే శక్తి మీరిస్తారా?


అలా కాకుండా ఒంటరి గా పోరాడటానికి చాలా శక్తి కావాలని, అది మీరిస్తారా? ఇస్తానంటే ఒంటరిగానే వెళదామని మీరంటే హర్షధ్వానాలతో స్పందించండి అని ఆ సభలో కోరారు. పొత్తులు ఎందుకు అవసరమవుతున్నాయి? బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి బలాన్ని ఏవిధంగా సమకూర్చుకోవాలి? తదితర విషయాలను ఆ సభలో విశ్లేషణాత్మకంగా చెప్పారు. వ్యూహాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమన్నారు. ఒకప్పుడు భారతీయ జనతాపార్టీ రోడ్ మ్యాప్ ఇస్తుందని, ఆ ప్రకారం వెళదామని పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తోన్న పవన్ వ్యూహాన్ని తనకే వదిలిపెట్టమని కోరారు.

గౌరవప్రదమైన సీట్లివ్వాలి..

గౌరవప్రదమైన సీట్లివ్వాలి..

స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని ఆ ప్రకారం నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవడానికి, గౌరవనీయమైన సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాల్సిందేనని స్పష్టత ఇచ్చారు. రణస్థలం సభకు ముందే హైదరాబాద్ లో చంద్రబాబును పవన్ కలిశారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఆ సమావేశంలో సీట్ల విషయం ఖరారయ్యే ఉంటుందని, అందుకే గౌరవప్రదంగా సీట్లిస్తే అన్నది మంద్ర స్వరంతో పవన్ అన్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతానికి భిన్నంగా పవన్ తీరు

గతానికి భిన్నంగా పవన్ తీరు

గతానికి భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నారని, మాటతీరు, ప్రజలకు విషయం చెప్పడంలో కూడా చాలా మార్పు కనపడుతోందన్నారు. పొత్తుల్లేకుండా పోటీచేయడం ఆత్మహత్యా సదృశ్యమని, ఒంటరిగా వెళ్లి, పోరాడి, వీర మరణం చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యర్థిని ఓడించడమొక్కటే జనసేన లక్ష్యం కావాలని శ్రేణులకు ఉద్భోదించారు. గతానికి భిన్నంగా జనసేన శ్రేణుల్లో కూడా మార్పు వచ్చింది. విజయం సాధించాలంటే తమ యువత ఓట్లు ఒక్కటే సరిపోవదని, ఇంట్లో అమ్మా,నాన్నలతోపాటు బంధువులను కూడా జనసేనకు ఓటేసేలా ఒప్పించాలనుకుంటున్నామని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన జనసేన శ్రేణులు ఇప్పుడు ఓట్లు చీలిపోకుండా ఉండటానికే మద్దతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+