వైఎస్ జగన్ మారణహోమం చేసి దేశం దాటిపోయారు: టీడీపీకి దొరికిన ఆయుధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ నాటి నుండి అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై ఈసీ సీరియస్ అయింది. రాష్ట్రంలో సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో సిట్ బృందం రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు జరిగిన ప్రాంతాలలో పర్యటించి అక్కడ విచారణ జరిపి, ప్రాథమిక నివేదికను డిజిపికి అందజేసింది.
జగన్, వైసీపీ నేతల దాడులను టార్గెట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరిలో జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలు టిడిపి కూటమి ప్రేరేపించడం వల్లనే జరిగిందని వైసిపి ఆరోపిస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నే ఈ ఘర్షణలకు మూల కారణమని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక షాకింగ్ వీడియో ని పోస్ట్ చేసిన టీడీపీ జగన్ తో పాటు వైసీపీ నేతలు దౌర్జన్యాలను ప్రజల కళ్ళకు కట్టే ప్రయత్నం చేసింది.

ఈవీఎం ధ్వసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే వీడియో పోస్ట్ చేసిన టీడీపీ
ప్రజలు తమకు ఓట్లు వేయడం లేదని జగన్ చేయని పాపం లేదు అంటూ పేర్కొన్న టిడిపి పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి అని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదు.
— Telugu Desam Party (@JaiTDP) May 21, 2024
పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క… pic.twitter.com/RaZiLJfdKl
మారణహోమం చేసి, ఏమి తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటిపోయారు
ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏమి తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటిపోతే, ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదృశ్యమైన ఘటన పైన తెలుగుదేశం పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తరువాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు అంటూ టిడిపి హెచ్చరికలు జారీ చేసింది.
పిన్నెల్లిపై వైఎస్ జగన్ వ్యాఖ్యల వీడియో వైరల్
ఇక ఈ వీడియోపై కొందరు నెటిజన్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని ఉద్దేశించి ఆయన తనకు మంచి స్నేహితుడని మంచివాడని సౌమ్యుడు అని, ఎన్నికల్లో గెలిపిస్తే ఇంకా పైకి తీసుకు వెళ్తాను అంటూ చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
@PrkYsrcp మంచి స్నేహితుడు, మంచి వాడు, సౌమ్యుడు..
— Phani Gosala (@PhaniGosala) May 21, 2024
గెలిస్తే ఇంకా పైకీ తీసుకెళ్తా.. #PinnelaFactionFiles #YCPCriminalPolitics https://t.co/9PcjqqN58A pic.twitter.com/0vBbY4dgmt
మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై నారా లోకేష్ ఫైర్
ఈవీఎంలను ధ్వంసం చేసిన, పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యానికి పాల్పడిన రామకృష్ణారెడ్డి మంచివాడు ఎలా అయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటన పైన తనదైన శైలిలో స్పందించారు. సొంత బాబాయ్‌ని, ఓటేసి గెలిపించిన ప్రజల్ని, చివరికి ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
సొంత బాబాయ్‌ని, ఓటేసి గెలిపించిన ప్రజల్ని, చివరికి ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడులకి… pic.twitter.com/KQGKaiQQCI
— Lokesh Nara (@naralokesh) May 21, 2024
ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడులకి తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు . వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి జూన్ 4న ప్రజలు అసలు సిసలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన పేర్కొన్నారు.
-
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
ఒకే ఒక్క ప్రకటనతో మారిన ఏపీ రాజకీయ చిత్రం! లోకేష్‌కు పట్టాభిషేకం -
జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! -
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications