అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ, టీడీపీలు రైతులకు సమాధానం చెప్పాలి : పురందేశ్వరి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని బీజేపీ నేత మాజీ మంత్రి పురందరేశ్వరి డిమాండ్ చేశారు. రైతులు ఏ పార్టీకి భూములు ఇవ్వలేదని, ప్రభుత్వం కోసం ఇచ్చారని ఈ సంధర్భంగా అన్నారు. దీంతో వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు, ప్రతిపక్ష టీడీపీ పై కూడ ఉందని అన్నారు.

ఇక గతంలో అధికారంలో ఉన్న టీడీపీకి కేంద్రం రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్ల రూపాయలను ఇచ్చిందని చెప్పారు. అయితే ప్రభుత్వం టెంపరరీ రాజధాని నిర్మాణాలు చేపడుతున్నాని చెప్పడం రాష్ట్ర ప్రజలందరికి తెలుసని దుయ్యబట్టారు.చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌తో కాలం వెల్లదీశారని మండిపడ్డారు. మరోవైపు అధికార పార్టీ నేతలు రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పడం కరెక్టు కాదని అన్నారు. రైతులు రాష్ట్రం అభివృద్ది జరగుతుందని భావించి భూములు ఇచ్చారని అన్నారు.

 TDP AND YCP HAVE TO ANSWER THE FARMERS

ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గతంలోనే తాము పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని మొదటి నుండి స్వాగతిస్తుందని చెప్పారు. కాని ఆ అంశాన్ని పక్కన బెట్టి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రాజధాని ప్రాంత రైతులు పురందరేశ్వరిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలోనే పై ఆమె స్పందించారు.

English summary
BJP leader Purandeshwari has demanded that the opposition including YCP,have to answer to the farmers who have given land for the capital of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X