జగన్ ఇలాకాలో జెడ్పీటీసీ బై పోల్, సీన్ ఛేంజ్ - ఆ పార్టీకి అదే పెద్ద మైనస్..!!

పులివెందుల ఫైట్ ఆసక్తి కరంగా మారుతోంది. జెడ్పీటీసీ బై పోల్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ - వైసీపీ హోరా హోరీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాజాగా వైసీపీ నేతలు తాజా పరిణామాల పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. పులివెందుల ఎన్నిక గెలిచి రావాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. జగన్ సైతం తాజా పరిణామాల పైన ఆరా తీస్తున్నారు. కాగా, ఎన్నిక దగ్గర పడే కొద్దీ సీన్ ఛేంజ్ అవుతోంది. గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది.

హోరా హోరీ
జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ముమ్మరంగా ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. టీడీపీ నుంచి మంత్రులు, వైసీపీ నుంచి కీలక నేతలు హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గన్‌మెన్ల భద్రతతో కల్పించారు. వారికి పోలయ్యే ఓట్లు కీలకంగా మారనున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ దగ్గర పడుతుండటంతో ఈ ఎన్నికలు కాక రేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పులివెందులలో మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, మాధవీ, వైసీపీ నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, ఇక ఒంటిమిట్టలో మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధనరెడ్డిలు ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు.

TDP and YSRCP moving with new strategies to win Pulivendula ZPTC by poll

నువ్వా నేనా
పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. నిన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే టీడీపీలోకి తాజా చేరికలతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్‌రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. డాక్టర్ సునీత వివేకా హత్య గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమవుతున్నాయి. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బరిలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్‌‌మెన్ సౌకర్యం కల్పించారు.

కరువైన సమన్వయం
పులివెందులతో పాటుగా ఒంటిమిట్టలోనూ పోలింగ్ జరగనుంది. అక్కడ కూడా పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య సమన్వయం కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్‌గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్‌చార్జ్‌ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజ లో ఉంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారింది. దీంతో, ఇక్కడ చివరి నిమిషం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+