పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు ఎప్పుడంటే ? కేంద్రం క్లారిటీ..!

ఇరాన్ యుద్దం ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఎట్టకేలకు డీల్ కుదిరింది. దీంతో నాలుగు నెలలుగా క్రమంగా పెరుగుతూ పోయిన క్రూడాయిల్ (Crude) ధరలు కూడా దిగివస్తున్నాయి. దీంతో భారత్ లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లు (Fuel prices) తగ్గుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూసున్నారు. దీంతో కేంద్ర పెట్రోలియం, సహజవనరులశాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ (suresh gopi) చమురు ధరల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

APSRTC ఛార్జీల పెంపు తప్పదా ? చమురు సంక్షోభం వేళ..!
APSRTC ఛార్జీల పెంపు తప్పదా ? చమురు సంక్షోభం వేళ..!

ఇరాన్ యుద్ధం ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 80 డాలర్లకు పడిపోయింది. నిన్న మొన్నటివరకూ 100 డాలర్లు పలికిన ధర బారీగా పతనం కావడంతో ఆ మేరకు భారత్ లో వినియోగదారులకు చమురు సంస్థలు ఊరటనిచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపీ సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు చమురు ధరలు తగ్గించలేమని ఆయన తేల్చిచెప్పేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు.

No Quick Fuel Price Cut Despite Crude Fall Says Union Minister Suresh Gopi
ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక..!
ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక..!

తక్కువ ధరకు లభించే ముడి చమురును హార్ముజ్ జలసంధి మీదుగా భారత్‌కు రవాణా చేయాల్సి ఉంటుందని, ఆ మార్గంలో నౌకల రాకపోకల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి దీనికి కొంత సమయం పడుతుందని సురేశ్ గోపీ తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుండి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఆ భారాన్ని భరించడం వల్ల కేంద్రం రూ. 12,000 కోట్లు నష్టపోయిందన్నారు. ఇంధన ధరలు పెరిగినప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఏ రాష్ట్రమూ తమ ఆదాయాన్ని తగ్గించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నడవాలి, అలాగే చమురు కంపెనీలు కూడా మనుగడ సాగించాలని సురేశ్ గోపీ గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+