Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అనిత లేఖాస్త్రం.. మహిళలపై అఘాయిత్యాలు, దిశా చట్టంపై సూటి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన రమ్య హత్యోదంతం తరువాత పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా టీడీపీ అధికార పార్టీ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దిశా చట్టాన్ని అమలు చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూడాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై జరుగుతున్న దాడులపై జగన్ సర్కార్ పై నిరంతరం విరుచుకుపడుతున్న టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తాజాగా ఓ లేఖ రాశారు.

మహిళలపై అఘాయిత్యాలు అరికట్టటం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ?

మహిళలపై అఘాయిత్యాలు అరికట్టటం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి ?

ఆ లేఖలో వంగలపూడి అనిత ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన అనిత ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని లేఖ ద్వారా కోరారు. అఘాయిత్యాలకు పాల్పడే నేరస్థులకు దిశ చట్టం అమలు చేస్తున్నారా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా ఎంత మందికి శిక్ష వేశారో చెప్పాలని వంగలపూడి అనిత తన లేఖలో ప్రశ్నించారు.

రమ్య ఘటనకు కారణమైన వ్యక్తిని ఎందుకు ఉరి తియ్యలేదు ?

రమ్య ఘటనకు కారణమైన వ్యక్తిని ఎందుకు ఉరి తియ్యలేదు ?

గడచిన 24 నెలల్లో 500 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే 21 రోజుల్లో ఎంతమందికి శిక్షలు వేశారో చెప్పాలని ఆమె జగన్ సర్కార్ ను నిలదీశారు. ఇప్పటివరకు ప్రేమోన్మాది దాడిలో దారుణహత్యకు గురైన రమ్య ఘటనకు కారణమైన వ్యక్తి ని ఎందుకు ఉరి తీయలేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. మహిళలతో నీచంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిన మీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించిన అనిత రాష్ట్రంలో ఎన్ని దారుణ ఘటనలు జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉండడానికి ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

 టీడీపీ హయాంలోని ఫోర్త్ లయన్ యాప్ ను, జగన్ దిశా యాప్ గా ప్రచారం దివాలాకోరుతనం కాదా ?

టీడీపీ హయాంలోని ఫోర్త్ లయన్ యాప్ ను, జగన్ దిశా యాప్ గా ప్రచారం దివాలాకోరుతనం కాదా ?

ఇక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి దిశ యాప్ గా మార్చారని అనిత విమర్శించారు. దిశ యాప్ ను ఏపీ ప్రభుత్వం రూపొందించినట్లు ప్రచారం చేసుకోవడం దివాలాకోరుతనం కాదా అంటూ జగన్ సర్కార్ పై అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయడంపై పెట్టే దృష్టి, తెలుగుదేశం పార్టీ ఆందోళనలను ఆపడం పై పెట్టే దృష్టి అత్యాచారాలను అఘాయిత్యాలను, నిరోధించడంపై పెడితే బాగుండేదని జగన్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు . జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలకు రక్షణ కరువైందని వంగలపూడి అనిత పదే పదే విమర్శిస్తున్నారు.

Recommended Video

    YSR Rythu Bharosa: రైతు భరోసా పేరుతో మోసం, రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు : Anitha
     జగన్ తో పాటు హోం మంత్రి సుచరితను టార్గెట్ చేస్తున్న వంగలపూడి అనిత

    జగన్ తో పాటు హోం మంత్రి సుచరితను టార్గెట్ చేస్తున్న వంగలపూడి అనిత

    ఫేక్ సీఎం, ఫేక్ హామీలు ఇస్తున్నారని.. ఫేక్ దిశ చట్టాలను తీసుకు వచ్చారని నిప్పులు చెరుగుతున్నారు. ఇక రాష్ట్రంలో హోమంత్రి డమ్మీగా మారారని, మహిళలపై అఘాయిత్యాలు దాడులను నిలువరించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని హోం మంత్రిని సైతం టార్గెట్ చేస్తూ వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు జాతీయ మహిళా కమిషన్ కు సైతం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, ప్రేమోన్మాదుల దాడుల ఘటనలపై వంగలపూడి అనిత లేఖ రాసి మరీ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై జాతీయ మహిళా కమిషన్ దృష్టిసారించాలని ఆమె లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+