మోదీ సభ మీద కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు , పవన్ కల్యాణ్, గ్రాఫిక్స్ కాదు, నిజంగా చూపిద్దాం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు ఎన్నిక కమీషన్ తేదీ ప్రకటించింది. రెండోసారి మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాతో ఉంది. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరికి కిరీటం పెడుతారో అని ఉత్కంఠ మొదలైయ్యింది.
వైసీపీ ప్రభుత్వానికి మంగళం పాడుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిసభలో నొక్కి చెబుతున్నారు. సైకో ప్రభుత్వానికి చివరికి రోజులు వచ్చాయని, కేవలం 50 రోజులు ఓపికగా ఉంటే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అంత వరకు వైసీపీ ఆగడాలను ఓర్చుకోవాలని శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

ఆదివారం చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కీలకవ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని తెలిసింది. మోదీ బహిరంగ సభను విజయవంతం చెయ్యడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత మంది కార్యకర్తలను మోదీ సభకు హాజరు అయ్యేలా చూడాలని మూడు పార్టీల నేతలు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
సీఎం జగన్ సిద్దం సభలకు జనం రాలేదని, గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఇంతకాలం ఆరోపణలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రధాని మోదీ బహిరంగ సభకు ఎన్ని లక్షల మంది హాజరు అయ్యేలా చేస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎంత మంది చిలకలూరిపేట బహిరంగ సభకు హాజరు అవుతారు అని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు.
ప్రధాని మోదీ బహిరంగ సభకు ఊహించని జనం రాకపోతే పరువు పోతుందని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను బహిరంగ సభకు హాజరుకావలని మనవి చేస్తున్నారని, కార్యకర్తలను పిలుచుకుని వచ్చే బాధ్యత ఆ పార్టీల నాయకులకు అప్పగించారని తెలిసింది. మొత్తం మీద ఆదివారం చిలకలూరిపేటలో జరిగే మోదీ బహిరంగ సభ మీద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కోటి ఆశలుపెట్టుకున్నారు. శనివారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కొందరు నాయకులు చిలకలూరిపేటలోనే ప్రత్యేక సమావేశం అయ్యి ఆదివారం జరిగే సభ గురించి చర్చిస్తున్నారని తెలిసింది.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!











Click it and Unblock the Notifications