చంద్రబాబు - పవన్ కు బీజేపీ క్లియర్ సంకేతాలు : అర్దమవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని ఈ ఇద్దరు నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. బీజేపీని ఒప్పిస్తామని పవన్ ధీమాగా చెబుతున్నారు. కానీ, బీజేపీ నుంచి భిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ను ఫిక్స్ చేద్దామని భావిస్తున్న వేళ తాజా నిర్ణయాలు ఈ ఇద్దరు నేతలకు అంతు చిక్కటం లేదు.

సీఎం జగన్ కు మద్దతుగా :ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం నుంచి మద్దతు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు పాలనా పరంగా ఆర్దిక నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్నికల ఏడాది కావటంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే పెండింగ్ హామీలు..బిల్లుల విడుదల చేయాల్సి ఉంది. దీని కోసం ప్రధాని మోదీతో సీఎం జగన్ పలు మార్లు చర్చలు చేసారు. ఏపీకి అండగా నిలవాలని కోరారు.

అందులో భాగంగా ప్రధాని ప్రత్యేకంగా ఏపీకి సాయం విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్దిక సంవత్సరంలో 32 వేల కోట్ల మేర రుణాలకు అనుమతి ఇచ్చారు. ఏపీకి రావాల్సిన రెవిన్యూ లోటు నిధుల కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా ఆమోదం చెప్పని కేంద్రం..ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్ధనతో విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.

 jagan-chandrababu-madi-pawan

బీజేపీ తో పొత్తు దిశగా :ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఆర్దిక కష్టాలతో పథకాల అమలు కష్టంగా మారుతుందని ప్రతిపక్షాలు అంచనా వేసాయి. ఉద్యోగుల బకాయిలు..కాంట్రాక్టర్లకు విడుదల చేయాలని పెండింగ్ బిల్లులు.. నిర్వహణ ఖర్చుల భారం సమస్యగా మారుతుందని లెక్కలు వేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైన రాజకీయంగా దాడిని పెంచారు. ఎన్నికల సమయంలోనూ కేంద్రంలోని ముఖ్యుల నుంచి మేనేజ్ మెంట్ లో సాయం లేకుండా చూడాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగానే చంద్రబాబు - పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పవన్ నేరుగా బీజేపీ ముఖ్యులతో ఇదే ప్రతిపాదన పైన చర్చలు చేసారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావటంతో పవన్ ప్రతిపాదన పైన బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందనే అంచనాలు పెరిగాయి.

ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు :పొత్తుల వ్యవహారం పైన బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాము కోరుకున్న దానికి భిన్నంగా కేంద్రం నుంచి సీఎం జగన్ కు మద్దతు కనిపిస్తోంది. రాజకీయంగా జగన్ కు ఊరటనిచ్చేలా నిర్ణయాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో టీడీపీ స్థానంలో ఎదగాలనేది బీజేపీ లక్ష్యం. పవన్ తో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు.

తనతో పొత్తు కొనసాగిస్తూనే జగన్ తో సన్నిహితంగా ఉండటంత పైన పవన్ కు రుచించటం లేదు.ఇప్పుడు కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు పొత్తు రాజకీయం పైన ప్రభావం చూపుతున్నాయి. దీని పైన ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చ సాగుతోంది. దీంతో, బీజేపీ అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకూ చంద్రబాబు - పవన్ వేచి చూస్తారా లేక, ఈ రెండు పార్టీలే పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+