నిన్న కవిత, నేడు మంత్రి: కేసీఆర్‌ని చిక్కుల్లో పడేసేనా?
హైదరాబాద్: గురుకుల్ కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నాలుగు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ బాంబు పేల్చగా... సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరో అంశాన్ని ఎత్తి చూపింది. తద్వారా కేసీఆర్‌ను విపక్షాలు గురుకుల్ వ్యవహారంలో చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ కేసీఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అంశాన్ని ప్రస్తావించగా.. నేడు టీటీడీపీ కేసీఆర్ కేబినెట్లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసం కూల్చివేత అంశాన్ని ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు సోమవారం గురుకుల్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గురుకుల్ భూముల్లోని సామాన్యుల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం సంపన్నుల జోలికి ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి నివాసాన్ని ఎందుకు కూల్చలేదని వారు ప్రశ్నించారు.
నాలుగు రోజుల క్రితం బీజేపీ శాసన సభా పక్ష ఉపనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. 2011లో గురుకుల్‌లో కూల్చివేతల సమయంలో కల్వకుంట్ల కవిత అడ్డుపడ్డారని, నాడు కవిత సక్రమమని తేల్చినవే ఇప్పుడు ఆమె తండ్రి, సీఎం కేసీఆర్‌కు అక్రమంగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications