బాలకృష్ణ 'పీఏ'ని తరిమేద్దాం: తమ్ముళ్ల ఆగ్రహం, రంగంలోకి లోకేష్

హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత బాలకృష్ణ పీఏ చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గ ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తల నుంచి కూడా లంచాలు తీసుకొని అవినీతిలో కూరుకుపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి.

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత బాలకృష్ణ పీఏ చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గ ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తల నుంచి కూడా లంచాలు తీసుకొని అవినీతిలో కూరుకుపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇలాంటి లంచగొండి పీఏను ఐకమత్యంతో తరిమికొడదామని మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులు అన్నారు. మంగళవారం సాయంత్రం లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలోని ఓ తోటలో టిడిపి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఏ అంశంపై చర్చ జరిగింది.

ఎమ్మెల్యే బాలకృష్ణ ఏరికోరి తెచ్చుకున్న పీఏ చంద్రశేఖర్ అవినీతిలో కూరుకుపోయాడని, ఆయన ఆగడాలు అంతుమీరాయని టిడిపి శ్రేణులు రోడ్డెక్కడం గమనార్హం. ఆయన కార్యకర్తలను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు సమావేశాలు నిర్వహిస్తుండటం గమనార్హం.

balakrishna

హిందూపురంలో తన పట్టు పెంచుకోవడం కోసం సీనియర్ నేతలను కూడా సస్పెండ్ చేశారని అంటున్నారు. ప్రజలకు తనకు మధ్య గ్యాప్ లేకుండా ఉండేందుకు బాలకృష్ణ ఆయనను నియమిస్తే.. ఆయన ఆగడాలు అంతుమీరుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే హిందూపురం, లేపాక్షిలో టీడీపీ శ్రేణులు శేఖర్‌ పెత్తనానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. అదే ఊపులో చిలమత్తూరులో కూడా ఈనెల 5న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రాష్ట్ర సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద టీడీపీ కీలక నేతలు భేటీ అయ్యారు. చిలమత్తూరు సమావేశాన్ని విజయవంతం చేసేందుకు శ్రేణులను భారీగా తరలించే యోచన చేసినట్లుగా తెలుస్తోంది.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేకపోతున్న కారణంగా.. అభివృద్ధి పనుల పర్యవేక్షణతోపాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా శేఖర్‌ను పీఏగా నియమించుకున్నారు.

అయితే బాలకృష్ణ బలహీనతను ఆసరాగా చేసుకుని శేఖర్‌ స్థానిక పార్టీ నాయకులపైనా, శ్రేణులపైనా పెత్తనం సాగిస్తున్నారని అంటున్నారు.

తమ బాధలను బాలకృష్ణకు చెప్పుకోలేక లేదా చెప్పుకునే అవకాశం లభించక వీరు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఆయన కనుసన్నుల్లో పని చేయకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.

దశాబ్దాలుగా టీడీపీ జెండాలు మోసినవారిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమివ్వడం, మున్సిపాలిటీ పాలకవర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం వంటి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చేసేది లేక టిడిపి శ్రేణులు ఒక్కటై చివరికి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

మరోవైపు, హిందూపురంలో తనపై పెల్లుబికిన వ్యతిరేకతతో శేఖర్‌తోపాటు ఆయన వర్గీయులు ఆత్మరక్షణలో పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు, అసమ్మతి వాదుల పైన వేటుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, దీనిపై బాలకృష్ణ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ తన వ్యక్తిగత వేగులతో సమాచారం తెలుసుకున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+