జగన్ నుంచి ఆ మాట వినాలనుందన్న బాలయ్య: పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ గెలుపు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఊహించని ఫలితాలను సాధించింది. ఏకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఊహించని ఫలితాలను సాధించింది. ఏకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా వెలువడిన పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) నియోజకవర్గం ఫలితం శనివారం రాత్రి వెలుడింది.

పశ్చిమ రాయలసీమలోనూ టీడీపీ జయకేతనం
వైసీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ రాయలసీమలో టీడీపీ, వైసీపీ అభ్యర్థి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. చివరకు టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి.. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీ పడినా వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైసీపీ అభ్యర్థి రవీంద్రా రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ కౌంటింగ్ కేంద్రంలో నిరసన తెలిపారు.

వైనాట్ 175 అని జగన్ అంటే వినాలని ఉంందన్న బాలకృష్ణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించడంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నారతీశారన్నారు. ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని వ్యాఖ్యానించారు. అంతేగాక, వైనాట్ 175 అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉందని బాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక గెలిచిన అభ్యర్థులకు బాలయ్య అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్సీ ఫలితాలు ఏపీకి శుభసూచకమంటూ చంద్రబాబు హర్షం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధంచడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రజా విజయం, మార్పునకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూటు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు.

గెలిచినా డిక్లరేషన్ ఇవ్వడం లేదు: ఈసీకి చంద్రబాబు లేఖ
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియలో తాజా పరిణామాలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినప్పటికీ.. డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేశారని అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారని తెలిపారు. సీఎంవో నుంచి వచ్చిన ఒత్తిడి కారణాంగనే డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఈసీని కోరారు. మరోవైపు, డిక్లరేషన్ సర్టిఫికేట్ కోరుతూ మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications