ఫలితాలకు ముందు టీడీపీ అభ్యర్థికి బిగ్ షాక్
ఏపీలో సమ్మర్ హీట్ కన్నా కూడా పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మే 13న ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పొలిటికల్ హీట్ కాస్త చల్లబడింది. అయితే అదే రీతిలో అందురూ జూన్4వ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఫలితాలకు ముందు టీడీపీ అభ్యర్థికి గట్టి షాక్ తగిలింది. భర్త తరుఫున ప్రచారం చేశారనే కారణంతో టీడీపీ అభ్యర్థి భార్యను అధికారులు సస్పెండ్ చేశారు.విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన భార్య లావణ్య ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా ఆయన భార్య లావణ్య ఎన్నికల ప్రచారం చేశారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆమెను సస్పెండ్ చేశారు.

ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటి రిజిస్ట్రార్ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈనెల 4వ తేదీన పల్లా లావణ్య తన భర్త, టీడీపీ అభ్యర్ధి అయిన శ్రీనివాసరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అదే అంశం అన్న దాని మీదనే ఈ చర్యలు తీసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య దీనిపై స్పందిస్తూ...తాను ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని అక్కడ ఒక మహిళను మాత్రమే కలిశాను అని చెప్పారు. ఆమె ఇచ్చిన సమాధానికి ఈసీ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. లావణ్య ప్రచారం నిజమే అని తేలితే అది ఆమె ఉద్యోగానికి ఎసరొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications