చంద్రబాబుకు నేడు బెయిల్ దక్కేనా, సీఐడీ బిగ్ స్టెప్ - ఉత్కంఠ..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వచ్చేనా. ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న అంశం. ఈ నెల 9న స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు కోర్టు రిమాండ్ తో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో దాఖలు చేయటంతో ఈ రోజు విచారణకు రానుంది. అటు హైకోర్టులో చంద్రబాబు ఇదే కేసులో క్వాష్..రిమాండ్ రివ్యూ పిటీషన్ దాఖలు చేసారు. వీటిపైన సీఐడీ కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటీషన్లపై కోర్టు నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.
నేడే పిటీషన్ల విచారణ:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారా. ఈ రోజు బెయిల్ దక్కుతుందా. ఇప్పుడు ఈ ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేసిన తరువాత ఈ నెల 10న విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.

చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ రిపోర్టు పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేసారంటూ చంద్రబాబు తరపు వాదించిన న్యాయవాది లూద్రా రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. చంద్రబాబు ప్రమేయం ఉందంటూ సీఐడీ తరపు అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదించారు. దీంతో, ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు.
హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:ఏసీబీ కోర్టు రిమాండ్ ఆదేశాల పైన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. అసలు ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని వాదించారు. అదే సమయంలో రిమాండ్ రివ్యూ పిటీషన్ కూడా కోర్టులో దాఖలైంది. దీంతో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు పైన సీఐడీ అప్పట్లోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్ కోసం ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఈ వ్యవహారంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వీటి పైన సీఐడీని కౌంటర్ దాఖలు చేయాని ఆదేశించిన హైకోర్టు ఈ రోజుకు కేసు విచారణ వాయిదా వేసింది. సీఐడీ కౌంటర్ లో ఏ అంశాలు ప్రస్తావిస్తుందీ..ఆ తరువాత కోర్టు నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

బెయిల్ పిటీషన్ పై విచారణ:ఇదే సమయంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. చంద్రబాబుకు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దాఖలైన పిటీషన్లను న్యాయస్థానం ఈ రోజు విచారణకు నిర్ణయించింది. ఇదే సమయంలో చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టులో క్వాష్, రిమాండ్ రివ్యూ పిటీషన్ పైన నిర్ణయానికి అనుగుణంగా ఏసీబీ కోర్టు తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు బెయిల్ పైన ఏసీబీ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ రోజు అటు హైకోర్టు, ఇటు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసే కౌంటర్లు.. వినిపించే వాదనల తరువాత చంద్రబాబు పిటీషన్లపైన న్యాయస్థానాల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ దక్కేనా..ఏం జరిగుతుందనే అంశంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications