అమెరికాలో వీధుల్లో బాబు ఉల్లాసంగా.. ఉత్సాహంగా: ఎన్నారైల‌తో క‌లిసి ప‌ల్లీలు తింటూ..(వీడియో)

Recommended Video

    అమెరికా వీదుల్లో తిరుగుతున్న చంద్రబాబు | Chandrababu Became Center Of Attraction In American Streets

    మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. వైద్య ప‌రీక్ష‌ల కోసం అమెరికా వెళ్లిన చంద్ర‌బాబు వెంట స‌తీమ‌ణి భువనేశ్వ‌రి మాత్ర‌మే వెళ్లారు. అమెరికాలోని మిన్నెసోట రాష్ట్రంలో ఉన్న మేయో క్లినిక్‌లో వైద్య ప‌రీక్ష లు చేయించుకున్నారు. ఒక రోజు విశ్రాంతి త‌రువాత అక్క‌డ ఉన్న టీడీపీ ఎన్నారై విభాగం..తానా స‌భ్యుల‌తో క‌లిసి అమెరికా వీధుల్లో ఉల్లాసంగా విహ‌రించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలతో డీలా ప‌డిన చంద్ర‌బాబు.. అమెరికా యాత్ర ద్వారా రిలాక్స్ అవుతున్నారు. అక్క‌డ వీధుల్లోని దుకాణాల‌ను సంద‌ర్శిస్తూ..ఉల్లాసంగా క‌నిపిస్తున్నారు. అమెరికా వీధుల్లో చంద్ర‌బాబు అలా వెళ్లుండ‌టంతో ఎన్నారైల‌కు ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారారు..

    అమెరికాలో వీధుల్లో చంద్ర‌బాబు సంద‌డి..

    అమెరికాలో వీధుల్లో చంద్ర‌బాబు సంద‌డి..

    టీడీపీ అధినేత చంద్ర‌బాబు అమెరికా వీధుల్లో సంద‌డి చేసారు. అమెరికాలోని మిన్నెసోట రాష్ట్రంలో ఉన్న మేయో క్లినిక్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ త‌రువాత ఆయ‌న విశ్రాంతి తీసుకున్నారు. త‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి తో క‌లిసి అమెరికా వెళ్లిన చంద్ర‌బాబును అక్క‌డి తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారితో క‌లిసి చంద్ర‌బాబు కొద్ద సేపు అమెరికా వీధుల్లో షాపింగ్ చేసారు. వారితో క‌లిసి వీధుల్లో విహ‌రించారు. అక్క‌డి నిర్మాణాలు..వ్యాపారాల‌ను ప‌రిశీలిం చారు. ఎన్నిక‌ల్లో ఓటమితో ఒక ర‌కంగా చంద్ర‌బాబు ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ మ‌ధ్య కాలంలో పార్టీ నుండి పెరుగుతు న్న వ‌ల‌స‌ల‌తో టెన్ష‌న్ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో వైసీపీతో హోరా హోరీగా త‌ల ప‌డిన చంద్రబాబు త‌న‌కు అధికారం..ప్ర‌తిపక్షం రెండు తెలుస‌ని..ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటాన‌ని తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల త‌రువాత తొలి సారి చంద్ర‌బాబు రిలాక్స్ మూడ్‌లో క‌నిపించారు.

    ప్ర‌వాసాంధ్రుల‌తో క‌లిసి..

    మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అమెరికాలోని ప్ర‌వాసాంధ్రుల‌తో క‌లిసి అమెరికా వీధుల్లో క‌లివిడిగా తిరిగారు. అక్క‌డ రోడ్ల మీద సాధార‌ణ పౌరుడిగా ఆస‌క్తిగా అన్నింటినీ తిల‌కించారు. ఏపీలో టీడీపీ విజ‌యం కోసం ప‌ని చేసిన ఎన్నారైలు చాలా మంది టీడీపీ అనుబంధంగా ఉన్నారు. తాజా మాజీ అధ్య‌క్షుడు కోమ‌టి జ‌య‌రాం..స‌తీశ్ వేమ‌న మిన్నెసోట లో చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి చర్చించారు. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం రావ‌టంతో ఆయ‌న ఆరోగ్యం గురించి ఆరా తీసారు. నాలుగు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు రాజ‌కీయాలు..ఇత‌ర వ్య‌వ‌హారాలు ప‌క్క‌న పెట్టేసారు. ప్ర‌తీ క్ష‌ణం ఏపీలో బీజీగా గ‌డిపే టీడీపీ అధినేత ఇప్పుడు మాత్రం అమెరికా వీధుల్లో చాలా రిలాక్స్‌డ్‌గా క‌నిపిస్తున్నారు. అలా వీధుల్లో న‌డుస్తూ ఎన్నారైల‌తో క‌లిసి వెళ్తున్న చంద్ర‌బాబు ను గుర్తు ప‌ట్టిన వారు ఆస‌క్తిగా తిల‌కించారు.

    ఏపీకి తిరుగు ప‌య‌ణం..

    ఏపీకి తిరుగు ప‌య‌ణం..

    వైద్య ప‌రీక్ష‌లు పూర్తి కావ‌టంతో ఇక చంద్ర‌బాబు తిరుగు ప‌మ‌ణ‌మ‌వుతున్నారు. ఏపీలో తాజాగా ప్ర‌భుత్వం పోల‌వ‌రం విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. పోల‌వ‌రం ఇక పూర్తి కాద‌నే ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి సైతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టంతో..చంద్ర‌బాబు ఏపీకి తిరిగి రానున్నారు. ఆయ‌న వ‌చ్చిన వెంట‌నే పార్టీ నుండి కొంత మంది నేత‌ల వ‌ల‌స‌ల గురించి సాగుతున్న చ‌ర్చ నేప‌థ్యంలో వారి మీద దృష్టి పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే విధంగా పోల‌వ‌రం భ‌విష్య‌త్ మీద చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును నిల‌దీసే ప‌రిస్థితి నెల‌కొని ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+