అదిరిపోయే సంక్షేమం ఇస్తాం - నవ్ ఆర్ నెవర్: వైసీపీపై చంద్రబాబు బ్రహ్మాస్త్రం..!!

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికలకు సంబంధించిన తొలి మేనిఫెస్టో రేపు ( ఆదివారం) మహానాడులోనే విడుదల చేస్తామని వెల్లడించారు. పేదలకు అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. వైసీపీ సంక్షేమం ఓట్లు కురిపిస్తుందనే నమ్మకంతో ఉన్న వేళ చంద్రబాబు కౌంటర్ ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు నవ్ ఆర్ నెవర్ అంటూ ప్రాధాన్యతను వివరించారు. తాను గెలిచే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీడీదీనని ధీమా వ్యక్తం చేసారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు : రాజమండ్రిలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ శకం ప్రారంభమైందన్నారు.

కార్యకర్తలు పార్టీ కోసం చేసిన త్యాగాలకు సెల్యూట్ చేసారు. భవిష్యత్ లో పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకొనే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజావేదిక విధ్వసంతో ప్రారంభమైన పాలన..అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఎక్కవ మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి.. సాష్ఠాంగ ప్రమాణాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 cbnjaganmahanadu-

టార్గెట్ 2024 ఎలక్షన్స్ : నాడు ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే ధనిక సీఎం జగన్ అయితే..పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్లను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఏపీలో రెండు వేల నోట్లు లేవన్నారు.

అవన్నీ వైసీపీ నేతలు మార్చి దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు. పీ 4 విధానం ద్వారా పేదలను ధనికులను చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువగళం బాగా జరుగుతోందని చంద్రబాబు ప్రశంసించారు. తాను నాడు అసెంబ్లీలో చేసిన శపధాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసారని పార్టీ శ్రేణులను అభినందించారు.

అదిరిపోయే సంక్షేమం ఇస్తాం : మహానాడు రెండో రోజు రేపు పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తొలి ఫేజ్ విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధి తో పాటుగా అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో నాడు తాము వేసిన పునాది కారణంగా ఆ రాష్ట్రం ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉందన్నారు. తనకు..కేడర్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదని ప్రకటించారు.

పార్టీని క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికారిక సారధులతో బలోపేతం చేసామని వివరించారు. ప్రతీ కార్యకర్త ప్రజలు..పేదలతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా పని చేయాలని నిర్దేశించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావంటే టీడీపీ అధికారంలోకి రావటం అవసరమని చంద్రబాబు వివరించారు. రేపు పార్టీ మేనిఫెస్టో ప్రకటనపైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయంగా మరింత ఆసక్తి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+