బీజేపీ అలా, పవన్ ఇలా - ఏం చేద్దాం, చంద్రబాబు మంత్రాంగం..!!

నవ్ ఆర్ నెవర్. వచ్చే ఎన్నికలపై పార్ట నేతలకు ఇదే విషయాన్ని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని నిర్దేశిస్తున్నారు. పొత్తుల వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యల పైన చంద్రబాబు ఫోకస్ చేసారు. సీఎం జగన్ నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అటు బీజేపీ తీరు..పవన్ వ్యాఖ్యల్లో కనిపిస్తున్న మార్పుతో పాటుగా సంక్షేమం లో ఇలా ముందకెళ్తామంటూ చంద్రబాబు పార్టీ నేతలతో మంత్రాంగం ప్రారంభించారు.

పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం:వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ మహానాడు వేదికగా ప్రకటించిన తొలి మేనిఫెస్టో పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. దీని పైన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు...

TDP Chief Chandra Babu key meeting with party leaders amid speculations on alliance with BJP, tour in Repalle

లోక్ సభ..అసెంబ్లీ ఇంఛార్జ్ లతో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైసీపీకి ధీటుగా ఏ విధంగా సంక్షేమం అందిస్తామనేది ప్రజల్లోకి తీసుకెళ్లేలా చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రధానంగా సంక్షేమ ఓట్ బ్యాంక్ ను నమ్ముకోవటం..టీడీపీ సంక్షేమం కొనసాగించదని ప్రచారం చేస్తున్న వేళ పార్టీ నేతలకు చంద్రబాబు పార్టీ వైఖరి స్పష్టం చేయనున్నారు.

పొత్తులు..ప్రచారంపై క్లారిటీ:పొత్తుల వ్యవహారం పైన పార్టీ నేతలకు చంద్రబాబు కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ, టీడీపీ పొత్తు పైన ప్రచారం మొదలైంది. బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసింది.

ఈ క్రమంలో బీజేపీతో టీడీపీ వైఖరి ఏంటనేది చంద్రబాబు స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. జనసేనతో దాదాపు పొత్తు ఖరారైన వేళ పవన్ కల్యాణ్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని..జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న సమయంలో టీడీపీలో భిన్నమైన చర్చ మొదలైంది. జనసేనాని వ్యాఖ్యలు..వ్యూహాల వేళ పార్టీ నేతలకు చంద్రబాబు ఎటువంటి సూచనలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల పైన చంద్రబాబు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది.

రేపల్లెకు చంద్రబాబు:టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ పై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి సంబంధించి బస్సు యాత్రలకు నిర్ణయించారు. ఈ రోజు పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

ఏపీ లోని 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్రల ద్వారా ప్రచారం ముమ్మరం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ రోజు రేపల్లోలో పర్యటించనున్నారు. దారుణ హత్యకు గురైన పదో తరగతి విద్యార్ధి ఉప్పాల అమర్ నాధ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పెట్రోలు పోసి హత్య చేయటం కలకలం రేపింది. ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ 10 లక్షల ఆర్దిక సాయం , ఇళ్ల స్థలం పట్టా అందించింది. పవన్ కల్యాణ్ ఈ ఘటన పైన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+