Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభ్యర్థుల్లో చంద్రబాబు మార్క్ మార్పులు - ఎవరెక్కడ..!!

ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టిడిపి తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. అయితే గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల మార్పుకు సైతం చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు మార్క్ మార్పులు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటివరకు తమ పార్టీ నుంచి 139 మంది అభ్యర్థులను ప్రకటించారు. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పనితీరు, ప్రజలతో మమేకమవుతున్న అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అవసరమైతే అభ్యర్థుల మార్పుకు సైతం వెనుకాడనని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా సర్వే లతో పాటుగా స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. పలువురు సీనియర్లకి ఇప్పటికి సీట్ల పైన స్పష్టత రాలేదు. అందులో భాగంగా టిడిపి పాలిటీ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు విజయనగరం జిల్లా గజపతినగరంలో నిలపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆయన ఎచ్చర్లకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీకాకుళం అసెంబ్లీ బిజెపికి ఇచ్చిన టిడిపి ఇప్పుడు ఎచ్చెర్ల ను కేటాయించింది.

TDP Chief Chandra Babu likely to change candidates in crucial constituencies as reports

మార్పులు - చేర్పులు : కొద్దిరోజుల క్రితమే గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాస్ ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయనకు స్థానికంగా అనుకూలతలేదని పార్టీ తాజాగా గుర్తించింది. చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్చార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. గంట తనకు భీమిలి కేటాయించాలని కోరుతున్నారు. ఈ సీటు పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న దర్శి నియోజకవర్గం నుంచి ఎన్నారై గరికపాటి వెంకట్, గోరంట్ల రవికుమార్, గొట్టిపాటి లక్ష్మీ పేర్లు ప్రైస్ లో ఉన్నాయి. వీరిలో ఒకరికి దర్శి సీటు దక్కే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్, గుంతకల్లు, రాజంపేట, ఆలూరు సీట్ల పైన ఇంకా నిర్ణయం జరగలేదు. ఆదోని సీటును బిజెపికి ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆలూరు సీటును ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.

TDP Chief Chandra Babu likely to change candidates in crucial constituencies as reports

కొనసాగుతున్న కసరత్తు : ఎంపి స్థానాల్లో ఇంకా ఒంగోలు, అనంతపురం, , రాజంపేట అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఒంగోలు నుంచి తిరిగి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నారు. నామినేషన్ల సమయం వరకు గెలుపే ప్రామాణికంగా పూర్తి సమాచారం సేకరిస్తామని అవసరమైనచోట్ల మార్పులు తప్పవని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. సీటు సీటు దక్కకపోవటంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని తొలత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భావించారు. తాజాగా చంద్రబాబును కలిశారు. అధికారంలోకి వచ్చినాక తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో రాజా తన నిర్ణయం మార్చుకున్నారు. బిజెపి కి కేటాయించే స్థానాల పైన కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తుంది. తుది చర్చల తర్వాత బిజెపి తమ జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో, చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల పైన టిడిపిలో ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+