కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు పై చంద్రబాబు బైఠాయింపు - సీఎం జగన్ కు సవాల్..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు పై బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు తనను అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు పదే పదే తనపైన ఆంక్షలు విధిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. రోడ్డు పైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. పోలీసులు తీసుకెళ్లిన తన ప్రచార రథం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాజమహేంద్రవరంలో సీఎం రోడ్ షో ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీఎంకు ఒక రూలు..తమకో రూలు ఉంటుందా అని నిలదీసారు. తన నియోజకవర్గ ప్రజలను కలుసుకోకుండా వెళ్లే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు.

కుప్పం పర్యటనలో భాగంగా గుడిపల్లి పార్టీ కార్యాలయం కు వెళ్లనీయకుండా అడ్డుకోవటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో, అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరు పైన నిరసన వ్యక్తం చేసారు. ఇతర ప్రాంతాల వారు గుడిపల్లికి రానీయకుండా అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల ను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. బానిసలుగా బతకవద్దని చెప్పుకొచ్చారు. పోలీసుల పైన తనకు కోపం లేదని, ప్రజల పక్షాన నిలబడి విధులు నిర్వర్తించాలని సూచించారు. తనను శారీరంగా ఇబ్బంది పెడతారు కానీ, కుప్పం నుంచి పంపలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి సమయం దగ్గరపడిందని..ప్రజలే దింపేసేందుకు సిద్దమయ్యారని చెప్పారు. వైసీపీని భూ స్థాపితం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేసారు.

TDP Chief Chandra Babu protest at Kuppam, serious on police restrictions on his tour

ప్రభుత్వం జారీ చేసిన జోవో నెంబర్ 1 చట్ట విరుద్దమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తన ప్రజల దగ్గరకు వస్తే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలో చెప్పటం లేదన్నారు. తాను నాడు తలచుకొని ఉంటే జగన్ పాదయాత్ర ముందుకు సాగేదా అని చంద్రబాబు నిలదీసారు. జీవో వచ్చిన తరువాత కూడా సీఎం, మంత్రులు రోడ్ షో చేసారని చంద్రబాబు పేర్కొన్నారు. చట్టాలు అమలు చేయకుండా పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్దంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని వదిలేది లేదని హెచ్చరించారు. తాను అయిదు కోట్ల మంది ప్రజల గొంతుకగా వ్యవహరిస్తున్నాని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రోడ్డు పైనే బైఠాయించి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

English summary
TDP Chief Chandra Babu portest at Kuppam against police retrictions on his tour, says he will not return from his constitunecy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X