Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ జేసీకి చంద్రబాబుకు షాక్ - వాట్ నెక్స్ట్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో సీట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. సీట్లు రాని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అనంతపురంలో టీడీపీకి కీలకమైన జేసీ ఫ్యామిలీకి సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో, కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

చంద్రబాబు కసరత్తు : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపికపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేస్తున్న వేళ చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లాలో టీడీపీ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లా నుంచి కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడినా..తాడిపత్రి మున్సిపాల్టీలో మాత్రం విజయం సాధించింది. ఈ జిల్లాలో ఈ సారి జేసీ ఫ్యామిలీ కి సీట్ల ఖరారు విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

TDP Chief Chandra Babu Rejects Seat for JC Diwakar Reddy son Pawan for next Elextions

జేసీ కుమారుడుకు నో సీట్ : జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తమ కుమారులు పవన్, అస్మిత్ రెడ్డితో పాటుగా చంద్రబాబును కలిసారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల ఖరారు పైన చర్చించారు. జిల్లా రాజకీయాలు, సీట్లలో మార్పులు చేర్పుల గురించి చర్చ జరిగింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఇంఛార్జ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అస్మిత్ స్థానంలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లనూ ఈసారి బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని.. ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేసారు.

TDP Chief Chandra Babu Rejects Seat for JC Diwakar Reddy son Pawan for next Elextions

కొత్త సమీకరణాలు : 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది తలారి రంగయ్య 141,428 ఓట్ల అమెజార్టీతో పవన్ పైన గెలుపొందారు. ఈ సారి వైసీపీ నుంచి మాజీ మంత్రి శంకర నారాయణ పోటీ చేస్తున్నారు. హిందూపురం కూడా జగన బీసీ మహిళ శాంతమ్మకు కేటాయించారు. దీంతో..ఈ సారి రెండు స్థానాలను బీసీలకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కుమారుడుకు సీటు లేదని చంద్రబాబు తేల్చేయటంతో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు జిల్లాలో చర్చకు కారణమవుతోంది. అదే విధంగా పరిటాల కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు క్లారిటీ ఇవ్వటంతో జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+