టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సెల్యూట్..!!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పైన చంద్రబాబు స్పందించారు. కార్యకర్తలకు సెల్యూట్ చేసారు.

టీడీపీలో జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలో రెండు స్థానాల్లోనూ టీడీపీ గెలవటం కొత్త లెక్కలకు కారణమవుతోంది. ఈ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయం సాధించిన అభ్యర్ధుల ను నందమూరి బాలకృష్ణ అభినందించారు. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్‌ అంటే వినాలని ఉందంటూ సెటైర్లు వేశారు. ఈ గెలుపు పైన పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు.

TDP Chief Chandra Babu Salute for Party workers who fight and win in MLC Graduates Elections against YSRCP

ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మూడు చోట్ల టీడీపీ విజయం సాధించింది. మూడు నియోజకవర్గాల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్దులు గెలుపొందారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసిన చంద్రబాబు ముందుగానే వ్యూహాత్మకంగా పీడీఎఫ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు ఎన్నికల్లో కలిసి వచ్చింది.

ఇప్పుడు మూడు రాజధానులు.. రాయలసీమలో వైసీపీ బలంగా ఉందనే సంకేతాల నడుమ ఈ ఫలితాలు టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ విజయం పైన స్పందించిన చంద్రబాబు పార్టీ శ్రేణులను అభినందించారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు,నాయకులకు సెల్యూట్ అంటూనే.. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పుకు సంకేతమని వ్యాఖ్యానించారు.

TDP Chief Chandra Babu Salute for Party workers who fight and win in MLC Graduates Elections against YSRCP

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలికి వెళుతున్న వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుతున్నట్లు తెలిపారు.

అలాగే వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయం మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకంగా చంద్రబాబు అభివర్ణించారు. ఇదే సమయంలో పశ్చిమ రాయలసీమలో తమ అభ్యర్ది గెలిచినా డిక్లరేషన్ ఇవ్వకపోవటం పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. రాయలసీమలో రెండు సీట్లు గెలవటంతో ఇప్పుడు అక్కడ టీడీపీ మరింత ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+