పోల‌వ‌రం ఇక క‌లగానే: న‌వ‌యుగ‌కు నోటీసుల‌పై చంద్ర‌బాబు ఫైర్‌: ఇదే జ‌గ‌న్ చిత్త‌శుద్ది..!

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు కొన‌సాగిస్తున్న న‌వ‌యుగ సంస్థ‌కు నోటీసులు ఇవ్వ‌టం..కాంట్రాక్టు నుండి త‌ప్పుకోమ‌ని ప్ర‌భుత్వం సూచించ‌టం పైన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. టీడీపీ ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ మంత్రిగా చేసిన దేవినేని ఉమా సైతం ఈ వ్య‌వ‌హారం పైన తీవ్రంగా స్పందించారు. ఇటువంటి నిర్ణ‌యాల ద్వారా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు పోల‌వ‌రం పైన ఏ పాటి చిత్త‌శుద్ది ఉందో అర్దం అవుతోంద‌ని ఆరోపించారు. త‌మ‌కు కావాల్సిన వారికి ప్రాజెక్టు ప‌నులు అప్ప‌గించ‌టానికి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని విమ‌ర్శించారు. ఇక‌..పోల‌వ‌రం క‌ల‌గానే మిగిలిపోతుం ద‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

పోల‌వ‌రం ఇక ముందుకు సాగ‌దు..
పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల నుండి న‌వ‌యుగ సంస్థ‌ను త‌ప్పుకోవాలంటూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌టం పైన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో పోలవరం ప్రాజక్టుకు వరద పోటెత్తుతున్నద‌ని.. వరద సమయంలో ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలను వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం నోటీసులు పంపడం సరికాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రాజక్టు పట్ల ప్రస్తుత ప్రభు త్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు. దీని ద్వారా ప్రాజెక్టు ఇక ముందుకు వెళ్ల‌టం క‌ష్ట‌మ‌ని..పోల‌వ‌రం క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న మేర‌కే న‌వ‌యుగ సంస్థ త‌క్కువ ధ‌ర‌కు ప‌నులు చేయ‌టానికి ముందుకు వ‌స్తే ప్రాజెక్టు ప‌నులు అప్ప‌గించామ‌ని ఇప్పుడు కేవ‌లం క‌క్ష్య సాధింపులో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆరోపించారు.

TDP Chief Chandra Babu seriously reacted on Govt giving notices to Navayuga in Polavaram works

నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌వ‌యుగ‌కు ప‌నులు..
దేశంలో అత్యంత వేగంగా పూర్త‌వుతున్నా ప్రాజెక్ట్‌ ఏదంటే అది పోలవరమేనని దేవినేని ఉమ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నవయుగకి పనులు ఇచ్చిందన్నారు పోలవరం ప్రాజెక్ట్‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డు వచ్చిం దన్నారు. ఈ ఏడాది 15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. పోలవరం విషయంలో జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. పోలవరంకు సంబంధించి సీఎం జగన్ ఇవాళ నోటీసులు పంపించారో.. ఇవే నోటీసులు 2009 ఆగస్టు 28న వచ్చాయని, మళ్లీ ఇవాళ వచ్చాయని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నాలుగేళ్లుగా పోలవరం పునాదులు లేవలేదని జగన్ అన్నారని, స్పిల్‌ వే పనులు చూశాక ఆయన నోరు తెరవలేకపోయారని దేవినేని విమర్శించారు. 1941నాటి కల చంద్రబాబు చేసి చూపించారన్నారు. జగన్‌కు కావాల్సిన వారికి పవర్‌ ప్రాజెక్ట్‌ కట్టబెట్టాలని చూస్తున్నారని, తమపై కక్షతో జగన్‌ దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+