Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా - చంద్రబాబు కొత్త లెక్కలు, లిస్టులో..!!

ఏపీలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలో గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు కొనసాగుతోంది. సీట్లు రాని కొందరు పార్టీ వీడుతున్నారు. ఈ వారంలోనే మొత్తం అభ్యర్దులను ఖరారు చేస్తామని వైసీపీ చెబుతోంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్దుల ప్రకటనపైన ఫోకస్ చేసారు. సంక్రాంతికి పార్టీ తొలి అభ్యర్దుల జాబితా విడుదలకు నిర్ణయించారు. ఈ లిస్టులో ఉండే వారి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి.

చంద్రబాబు కసరత్తు: ఈ సారి ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ జగన్ ను ఓడించేందుకు ఏ అవకాశం వదులుకోకూడదని భావిస్తోది. అభ్యర్దుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. సంక్రాంతి వేళ అభ్యర్దుల తొలి జాబితా విడుదలకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

TDP Chief Chandra Babu to announce first list of Contesting candidates on Sankranti

20-25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండవని సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, జగన్ సామాజిక లెక్కలు..ఎంపికను పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోసారి మార్పు అవసరం లేని నియోజకవర్గాల అభ్యర్దులను తొలి జాబితాలో ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

తొలి జాబితా సిద్దం: తొలి జాబితాతో కుప్పం- చంద్రబాబు, మంగళగిరి -లోకేశ్‌, టెక్కలి - అచ్చెన్నాయుడు తో పాటుగా మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఉండేలా ఈ జాబితా కూర్పు ఉండనుంది. అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్‌ సర్వే చేస్తున్నారు.

పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శ్యావల దేవదత్‌, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబి నాయన, తునికి యనమల దివ్య, వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ, గుడివాడ- వెనిగళ్ల రాము, గంగాధర నెల్లూరుకు డాక్టర్‌ థామస్‌ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

మార్పులు - చేర్పులు: కమలాపురం -పుత్తా నరసింహారెడ్డి, అరకు- దన్ను దొర, మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరు- నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌, కోవూరు- పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డి, పత్తికొండ- కేఈ శ్యాంబాబు, గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, మాడుగుల - పీవీజీ కుమార్‌, ఉంగుటూరు - గన్ని వీరాంజనేయులు, చీరాల- కొండయ్య యాదవ్‌ ఇన్‌చార్జులుగా ఉన్నారు.

వీటిలో గోపాలపురంలో వెంకటరాజును ఆ నియోజకవర్గంలో ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. చీరాలలో కొండయ్య యాదవ్‌ విషయంలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మాడుగుల సీటు విషయంలో కుమార్‌కు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, ఎన్నారై పైలా ప్రసాదరావు నుంచి పోటీ ఉంది. దీంతో, చంద్రబాబు అభ్యర్దుల ఎంపికలో లెక్కలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+