మీరు సిద్ధపడండి.. వైఎస్ జగన్ ను వ్యూహంలో బంధిస్తాం!!

రానున్న ఎన్నికల సందర్భంగా అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను ఉపయోగించుకొని దారుణాలకు పాల్పడుతుందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గ వ్యూహాన్ని తాను సిద్ధం చేస్తానన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకుంటుందని, దాన్ని ఎదుర్కోవాలంటే అందుకు తగ్గ వ్యూహాన్ని సిద్ధం చేయాలని పవన్ భావిస్తున్నారు.

గత ఎన్నికల పరిస్థితిని చూసిన టీడీపీ

గత ఎన్నికల పరిస్థితిని చూసిన టీడీపీ


2019 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు, పార్టీకి నిధులు సమకూర్చే వ్యక్తుల కార్యాలయాలపై దాడిచేయించింది. అన్నివైపుల నుంచి టీడీపీని దిగ్భందించింది. ఆ ప్రభావం ఎన్నికలపై పడింది. పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలన్నీ 5వేల మెజారిటీలోపే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాగైనా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

వైసీపీని ఎదుర్కోవడం అంత తేలికేం కాదు

వైసీపీని ఎదుర్కోవడం అంత తేలికేం కాదు


ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కోవడం అంత తేలికేం కాదని వారికి స్పష్టమైంది. అందుకే కేంద్రం నుంచి సహకారాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే ఎన్నికల్లో గెలవొచ్చనేది ఇద్దరు నేతల భావనగా ఉంది. ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారుకానీ సఫలీకృతమైన దాఖలాలు కనపడటంలేదు. అలాగే జనసేనానితో ప్రధానమంత్రి మోడీ విశాఖలో మాట్లాడటంతో రూట్ మ్యాప్ వచ్చిందా? లేదా? అనే సందిగ్ధంలో జనసేన శ్రేణులు ఉన్నాయి.

బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలని..

బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలని..

తెలుగుదేశం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. వీరితోపాటు బీజేపీని కూడా కలుపుకొని వెళితే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలతో ఇక్కడ వైసీపీని ఓడించాలనేది ఇద్దరు నేతల భావనగా ఉంది. అయితే కేంద్రం నుంచి వీరు కోరుకున్న రీతిలో అంగీకారం రాలేదు. దీంతో ఎవరికి వారుగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏ వ్యూహం పన్నినా అంతిమంగా వారికి బీజేపీ నుంచి సహకారం అందడమే. దానికోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాలను రూపందిస్తున్నారు. వైసీపీ ఎక్కువగా దొంగ ఓటర్లను నమోదుచేయిస్తుందని, దీనిపైనే దృష్టిసారించాలని ఇద్దరూ భావిస్తున్నారు. కేంద్రం నుంచి వీరికి సహకారం అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+